ఈ తక్కువ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీలు ఇస్తుంటే.., జియో డేటా ఎక్కువ అందిస్తోంది-airtel is offering otts in this low recharge plans and jio offering more data know which plan is best ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ తక్కువ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీలు ఇస్తుంటే.., జియో డేటా ఎక్కువ అందిస్తోంది

ఈ తక్కువ రీఛార్జ్ ప్లాన్స్‌లో ఎయిర్‌టెల్ ఓటీటీలు ఇస్తుంటే.., జియో డేటా ఎక్కువ అందిస్తోంది

Anand Sai HT Telugu

జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. జియో, ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం. ఒక కంపెనీ యూజర్లకు బోలెడన్ని ఓటీటీ యాప్స్ ఇస్తుంటే, మరో కంపెనీ 40 జీబీ డేటా ఇస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం

ియో, ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీల మధ్య నెంబర్ వన్‌గా నిలిచేందుకు పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులు ప్రయోజనం పొందుతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రెండు కంపెనీలు వేర్వేరు ప్లాన్లు, ఆఫర్లను అందిస్తున్నాయి. జియో తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలను ఇస్తుంది. ఎయిర్‌టెల్ ప్లాన్స్ కూడా జియోకు గట్టి పోటీని ఇస్తున్నాయి.

ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్ అందులో ఒకటి. నెట్ ఫ్లిక్స్ సహా 25కి పైగా ఓటీటీ యాప్స్‌కు ఈ ప్లాన్‌లో డేటాతో యాక్సెస్ కల్పిస్తోంది ఎయిర్‌టెల్. అదే సమయంలో జియో విషయానికొస్తే ఓటీటీ ప్రయోజనాల్లో ఎయిర్‌టెల్ కంటే వెనుకబడి ఉండొచ్చు కానీ డేటా పరంగా మాత్రం చాలా ముందుంది. అంతేకాదు రూ.10 ఎక్కువ. ఎయిర్‌టెల్, జియోకు చెందిన ఈ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

జియో రూ.289 ప్లాన్

జియో ఈ ప్లాన్ 30 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో మీరు ఇంటర్నెట్ ఉపయోగించడానికి మొత్తం 40 జీబీ డేటాను పొందుతారు. డేటా లిమిట్ ముగిసిన తర్వాత అందించే వేగం 64 కేబీపీఎస్ అవుతుంది. ఇది డేటా ప్యాక్.

ఎయిర్‌టెల్ రూ.279 ప్లాన్

ఈ ప్లాన్లో మీకు ఒక నెల వాలిడిటీ లభిస్తుంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ఇంటర్నెట్ ఉపయోగించడానికి మొత్తం డైలీ 1 జీబీ డేటాను ఇస్తుంది. ఈ ప్లాన్‌లో నెట్ ఫ్లిక్స్ బేసిక్‌కు ఉచిత యాక్సెస్ ఇస్తున్నారు. వీటితో పాటు జియో హాట్‌స్టార్ సూపర్, జీ5లకు కూడా యాక్సెస్ ఇస్తోంది. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్ ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియంతో వస్తుంది. ఇందులో మీరు సోనీ లివ్‌తో సహా 25కి పైగా ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ పొందుతారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.