Urinating on co-passenger: ఢిల్లీ-బ్యాంకాక్ ఎయిరిండియా విమానంలో ఓ భారతీయ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనను ధృవీకరిస్తూ విమానయాన సంస్థ ఎయిరిండియా ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జరిగిన తర్వాత సిబ్బంది డీజీసీఏ నిర్దేశించిన అన్ని విధివిధానాలను పాటించారని తెలిపింది.
2025 ఏప్రిల్ 9న ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఏఐ2336 విమానంలో ఒక ప్యాసెంజర్ తన సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను ఎయిరిండియా ధృవీకరించింది. సిబ్బంది అన్ని విధివిధానాలను పాటించారని, ఈ విషయాన్ని అధికారులకు నివేదించామని తెలిపింది. నిందితుడైన ప్రయాణికుడిని సిబ్బంది హెచ్చరించారని, ఈ సంఘటనకు గురైన బాధితుడు ప్రముఖ బహుళజాతి కంపెనీ ఉద్యోగి అని వెల్లడించింది. బాధితుడు తన ఫిర్యాదును బ్యాంకాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో తమ సిబ్బంది సహాయపడ్డారని ఎయిరిండియా తెలిపింది.
‘‘దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని హెచ్చరించడంతో పాటు, బాధిత ప్రయాణికుడికి బ్యాంకాక్ లోని అధికారులకు ఫిర్యాదు చేయడానికి మా సిబ్బంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై తీసుకోవలసిన చర్యలను నిర్ణయించడానికి స్టాండింగ్ ఇండిపెండెంట్ కమిటీని సమావేశపరుస్తారు. ఇలాంటి విషయాల్లో డీజీసీఏ నిర్దేశించిన ఎస్ఓపీలను ఎయిర్ ఇండియా అనుసరిస్తోంది’’ అని ఎయిరిండియా తెలిపింది.
తాజాగా ఎయిరిండియా విమానంలో జరిగిన మూత్ర విసర్జన కేసు 2022లో జరిగిన మరో సంఘటన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ముంబైకి చెందిన శంకర్ మిశ్రా అనే వ్యక్తి 2022 నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఘటన అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. మిశ్రాను ఆయన పనిచేసిన వెల్స్ ఫార్గో సంస్థ తొలగించింది. మిశ్రా కాలిఫోర్నియా ప్రధాన కేంద్రంగా ఉన్న బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ అయిన భారతదేశంలోని వెల్స్ ఫార్గోకు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2023 జనవరిలో మిశ్రాపై ఢిల్లీ పోలీసులు లైంగిక వేధింపులు, అశ్లీలత అభియోగాలు మోపారు. ఈ చర్యకు సంబంధించి కేసు నమోదు చేసిన విమానయాన సంస్థ ఆయనను 30 రోజుల పాటు విమానంలో ప్రయాణించకుండా నిషేధించింది.
సంబంధిత కథనం