Aimtron Electronics IPO: రూ. 50 జీఎంపీతో మార్కెట్లోకి ఎయిమ్ ట్రాన్ ఐపీఓ.. అప్లై చేయొచ్చా?
Aimtron Electronics IPO: ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.153 నుంచి రూ.161గా నిర్ణయించారు. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ పరిమాణం రూ.87.02 కోట్లుగా ఉంది. తొలి రోజు ఈ ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ జీఎంపీ రూ. 50 గా ఉంది.
Aimtron Electronics IPO: ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఐపీఓ మే 30న ప్రారంభమైంది. దీనికి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ అనేది ఎస్ఎంఈ ఐపీఓ. దీని బిడ్డింగ్ జూన్ 3న ముగుస్తుంది. ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ESDM) సర్వీస్ ప్రొవైడర్.
ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ జీఎంపీ
ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చిన తొలిరోజైన, మే 30న జీఎంపీ (GMP) ఒక్కో షేరుకు రూ.50గా ఉందని స్టాక్ మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. అంటే గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.50 పెరిగి రూ.211 వద్ద, ఇష్యూ ధర రూ.161తో పోలిస్తే 31.06 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది.
జీఎంపీ ఐపీఓ సబ్స్క్రిప్షన్ స్టేటస్
బిడ్డింగ్ ప్రక్రియ మొదటి రోజైన మే 30న ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ (Aimtron Electronics IPO) ఇప్పటివరకు 0.90 శాతం సబ్స్క్రైబ్ అయింది. మే 30, గురువారం మధ్యాహ్నం 1:50 గంటల వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పబ్లిక్ ఇష్యూలో 35.87 లక్షల షేర్లకు గాను 32.34 లక్షల ఈక్విటీ షేర్లకు బిడ్లు వచ్చాయి. రిటైల్ కేటగిరీలో 1.43 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బిడ్డర్స్ (క్యూఐబీ) కేటగిరీలో 0.32 రెట్లు, నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ ఐఐ) కేటగిరీలో 0.45 రెట్లు ఈ ఐపీఓ సబ్ స్క్రైబ్ అయింది.
ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ వివరాలు
మే 30న సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ అయిన ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ జూన్ 3న ముగియనుంది. జూన్ 4న ఐపీఓ కేటాయింపు, జూన్ 6న ఐపీవో లిస్టింగ్ తేదీ ఖరారయ్యే అవకాశం ఉంది. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఈక్విటీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో లిస్ట్ అవుతాయి. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.153 నుంచి రూ.161గా నిర్ణయించారు. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ పరిమాణం రూ.87.02 కోట్లుగా ఉంది. బుక్ బిల్ట్ ఇష్యూ పూర్తిగా 54.05 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ. ఈ ఐపీఓ లాట్ పరిమాణం 800 షేర్లు. అంటే, రిటైల్ ఇన్వెస్టర్లకు అవసరమైన కనీస పెట్టుబడి మొత్తం రూ.128,800.
రుణాల చెల్లింపు కోసం
ఈ ఎయిమ్ ట్రాన్ ఐపీఓ ద్వారా సమకూరిన మొత్తాన్ని రుణాలను పూర్తిగా లేదా పాక్షికంగా తిరిగి చెల్లించడానికి, అదనపు ప్లాంట్ మరియు యంత్రాల ఏర్పాటుకు మూలధన వ్యయానికి నిధులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మరియు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగించాలని కంపెనీ భావిస్తోంది. ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకు లీడ్ మేనేజర్ గా హేమ్ సెక్యూరిటీస్ వ్యవహరిస్తోంది. ముఖేష్ జెరామ్ వాసాని, నిర్మల్ ఎం వాసాని, షర్మిలాబెన్ లఖన్ భాయ్ బంభానియా ఈ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు. ఐపీఓ తర్వాత ప్రమోటర్ల వాటా 96.96 శాతం నుంచి 71.29 శాతానికి తగ్గుతుంది.
కంపెనీ ఆదాయం రూ.67.64 కోట్లు
ఎయిమ్ ట్రాన్ ఎలక్ట్రానిక్స్ కు భారత్ తో రెండు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అవి ఒకటి గుజరాత్ లోని వడోదరలో, మరొకటి కర్ణాటకలోని బెంగళూరులో ఉన్నాయి. 2023 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.67.64 కోట్లు, నికర లాభం రూ.9.76 కోట్లుగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.26.89 కోట్ల నుంచి 2023 ఆర్థిక సంవత్సరంలో 169 శాతం పెరిగి రూ.72.39 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.1.8 కోట్ల నికర నష్టంతో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.8.63 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.