మీ జాబ్ కూడా ఇదే అయితే.. ఏఐ తో మీ ఉద్యోగానికి ముప్పు తప్పదు!-ai to replace these jobs in a couple of years says ceo check your job falls in these categories ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  మీ జాబ్ కూడా ఇదే అయితే.. ఏఐ తో మీ ఉద్యోగానికి ముప్పు తప్పదు!

మీ జాబ్ కూడా ఇదే అయితే.. ఏఐ తో మీ ఉద్యోగానికి ముప్పు తప్పదు!

Sudarshan V HT Telugu

కృత్రిమ మేథ లేదా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) అన్ని రంగాల్లో, ఊహించినదాని కన్నా వేగంగా చొచ్చుకుపోతోంది. ఇప్పటికే ఏఐ ప్రభావం జాబ్ మార్కెట్ పై పడింది. భవిష్యత్తులో హై స్కిల్డ్ సహా కొన్ని రకాల జాబ్స్ చేసేవారు ఏఐ వల్ల తమ ఉద్యోగాలను పోగొట్టుకునే ముప్పు ఉందని ఏఐ రంగంలోని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఏఐ తో ఉద్యోగాలు పోయే రంగాలు

కృత్రిమ మేధస్సు సాధనాలు అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల, సమీప భవిష్యత్తులో అనేక సాంప్రదాయ డెస్క్ ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఏఐ కారణంగా మరో రెండేళ్లలో ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఉన్న పలు రంగాల గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి సాఫ్ట్ వేర్ ను రూపొందించడానికి వినియోగదారులకు వీలు కల్పించే ప్లాట్ఫామ్ అయిన రెప్లిట్ సీఈఓ అంజాద్ మసాద్ వివరించారు.

ఈ రంగాల్లోని ఉద్యోగాలకు ఏఐ ముప్పు

అంజాద్ మసాద్ తెలిపిన వివరాల ప్రకారం..

  • డిజిటల్ గా చేయగలిగే అన్ని పనులు ఏఐ చేస్తుంది కనుక, అలాంటి రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారి ఉద్యోగాలకు ముప్పు ఉంటుంది.
  • ఒకే విధమైన పని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ఏఐ బారిన పడకతప్పదు. మీ ఉద్యోగం, మీరు చేసే పని రొటీన్ గా ఉంటే, రాబోయే రెండు సంవత్సరాలలో మీ ఉద్యోగం పోతుంది.
  • డేటా ఎంట్రీ క్లర్కులు, క్వాలిటీ అస్యూరెన్స్ (QA) టెస్టర్లు వంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ఇతర స్కిల్స్ నేర్చుకోవాలి. ఈ పనులను మనుషుల కన్నా యంత్రాలు సమర్ధంగా చేయగలవు.
  • క్లిక్ చేయడం, టైపింగ్ చేయడం లేదా డేటాను ధృవీకరించడం వంటి పనులు కృత్రిమ మేధ వ్యవస్థలు ఇప్పుడు సమర్థవంతంగా నిర్వహించగలవు.
  • ఇన్ పుట్, అవుట్ పుట్ రెండూ డిజిటల్ గా ఉన్న ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీటిలో రాత, డేటా ప్రాసెసింగ్, విజువల్ డిజైనింగ్ వంటి విధులు ఉంటాయి. ఇవన్నీ ఆటోమేషన్ కు సాధ్యమైనవే.
  • కోడింగ్ వంటి సాఫ్ట్ వేర్ విధులను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సులువుగా, సమర్ధవంతంగా చేయగలదు.

న్యాయవాదులు, డాక్టర్లు కూడా..

అంతేకాదు, వృత్తి నైపుణ్యం అవసరమైన న్యాయవాద వృత్తి వంటి వాటిలో ఉన్నవారు కూడా ఏఐ బాధితులుగా మారే అవకాశం ఉంది. స్టాండర్డ్ డాక్యుమెంటేషన్, రెగ్యులేటరీ కాన్సెంట్ విధుల్లో అత్యధిక భాగం ఏఐ చేయగలదు. ఆరోగ్య సంరక్షణలోనూ ఏఐ చొచ్చుకుపోతోంది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన చాలా పనులను ఏఐ చేయగలదు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం