Mutual Funds : బడ్జెట్‌కు ముందు ఈ రంగాలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి
Budget 2025 : కేంద్ర బడ్జెట్ 2025 ప్రవేశపెట్టేందుకు సమయం దగ్గరపడింది. అన్ని రంగాల నుంచి ఈసారి అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటే మంచిది?
బడ్జెట్ 2025 కేటాయింపుల గురించి అందరికీ ఆసక్తి ఉంది. బడ్జెట్ వల్ల ఏయే రంగాలు లాభపడతాయో విశ్లేషిస్తే మీరు పెట్టుబడి పెట్టినా.. మంచి రాబడులు పొందుతారు. ఒక రంగానికి సంబంధించి ఆర్థిక ప్రాధాన్యతలు నిర్ణయించడానికి బడ్జెట్ ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం చేసే కేటాయింపులు, ప్రకటనలు, సంస్కరణలతో కొన్ని రంగాలకు ఎంతగానో ప్రయోజనం ఉంటుంది. ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు పలు రంగాల గురించి విశ్లేషించాలి. మూడు రంగాలకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేయాలని నిపుణులు చెబుతున్నారు.

పీఎస్‌యూ ఫండ్
ఈ బడ్జెట్‌లో పీఎస్‌యూల్లో పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంధనం, రైల్వేలు, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు సంస్కరణలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉందన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దీర్ఘకాలిక లక్ష్యాల ప్రకారం పీఎస్‌యూలలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు.
అయితే ఇన్వెస్టర్లు ఈ పథకాల్లో పెట్టుబడులను తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక రంగంపై కాకుండా ఇతర రంగాలపై దృష్టి సారించాలని ఫైనాన్షియల్ రేడియన్స్ వ్యవస్థాపకుడు రాజేష్ మినోచా సూచించారు.
డిఫెన్స్ ఫండ్
ఈ బడ్జెట్‌లో కేంద్రం డిఫెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. గత 10 ఏళ్లలో రక్షణ రంగానికి అంతర్జాతీయ సగటు కంటే ఎక్కువగా కేటాయింపులు పెరిగాయని గుర్తించారు. ఈ కేటగిరీలో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ ఫండ్ గత ఆర్థిక సంవత్సరం నుండి 15.35 శాతం క్షీణతను నమోదు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ 12.19 శాతం నష్టపోయింది. హెడ్జ్ ఫండ్స్ ప్రతికూల రాబడిని బట్టి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక లాభాల కోసం వేచి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్
బడ్జెట్‌కు ముందు మౌలిక సదుపాయాల రంగంపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గతేడాది ఆశించిన స్థాయిలో నిధులు రాకపోయినప్పటికీ ఈసారి కేటాయింపులు పెరిగే అవకాశం ఉందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ హెడ్ అభిషేక్ జైన్ అన్నారు. భారీ ప్రాజెక్టులపై జాప్యం లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో 18 మ్యూచువల్ ఫండ్ పథకాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు 2024 బడ్జెట్‌తో పోలిస్తే సగటున 10.89 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ ఫండ్స్ ప్రతికూల రాబడిని ఇస్తున్నప్పటికీ ఫండ్‌ను పెంచడాన్ని పరిగణించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీగా రాబడులు వస్తాయని చెప్పలేం. స్టాట్ మార్కెట్ మీద ఆధారపడి లాభాలు ఉంటాయి. దీర్ఘకాలంలో కొన్నిసార్లు రావొచ్చు, రాకపోవచ్చు.