PM Modi’s US visit: మోదీ యూఎస్ పర్యటనతో.. భారత్ లో బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన పెట్టుబడుల కోణంలో కూడా.. అత్యంత విజయవంతమైంది. టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్.. భారత్ లో బిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించాయి.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన పెట్టుబడుల కోణంలో కూడా.. అత్యంత విజయవంతమైంది. టెక్నాలజీ రంగంలో దిగ్గజ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆమెజాన్.. భారత్ లో బిలియన్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించాయి.
ట్రెండింగ్ వార్తలు
గూగుల్ పెట్టుబడులు..
భారత్ లో గూగుల్ సంస్థ పెట్టబోతున్న ఇన్వెస్టమెంట్స్ పై శనివారం ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయి ఒక ప్రకటన చేశారు. గుజరాత్ లోని గాంధీనగర్ గిఫ్ట్ సిటీ డిస్ట్రిక్ట్ లో గూగుల్ తమ ‘‘గ్లోబల్ ఫిన్ టెక్ ఆపరేషన్స్ సెంటర్ (Google global fintech operations centre)’’ ను ప్రారంభించబోతోందని సుందర్ పిచాయి వెల్లడించారు. అలాగే, భారత దేశ డిజిటైజేషన్ ఫండ్ లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీకి కూడా వివరించామన్నారు. భారత్ లో బలంగా ఉన్న యూపీఐ, ఆధార్ వ్యవస్థల సాయంలతో భారత్ ను ఫిన్ టెక్ లీడర్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు.
ఆమెజాన్ ఇన్వెస్ట్ మెంట్స్..
రానున్న ఏడేళ్లలో భారత్ లో 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఆమెజాన్ సీఈఓ యాండీ జాస్సీ వెల్లడించారు. వీటితో కలిపి భారత్ లో మొత్తంగా 26 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడ్తున్నామన్నారు. ప్రధాని మోదీని వాషింగ్టన్ లో వ్యక్తిగతంగా కలిసిన సమయంలో ఈ విషయాలను వివరించానన్నారు. స్టార్ట్ అప్ లకు సపోర్ట్, ఉద్యోగ, ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణ, ఎగుమతులకు ప్రోత్సాహం, చిన్న బిజినెస్ లకు ప్రోత్సాహం.. మొదలైన వాటిని భారత్ లో చేపట్టనున్నామన్నారు.
మైక్రో సాఫ్ట్ పెట్టుబడులు, టెస్లా కార్లు
అమెరికాలో ప్రధాని మోదీని కలిసిన వారిలో మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు. మనుషుల జీవితాల్లో కృత్రిమ మేథ తీసుకురానున్న విప్లవాత్మక మార్పులపై ఆయన ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన భారత్ లో మైక్రోసాఫ్ట్ పెట్టబోతున్న పెట్టుబడుల గురించి వివరించారు. ఇవి కాకుండా, టెస్లా కార్లను, స్టార్ లింక్ సాటిలైట్ ఇంటర్నెట్ ను భారత్ కు తీసుకురానున్నట్లు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ వెల్లడించారు.