రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెంచ్ మార్క్ వడ్డీ రేటును జూన్ 6 న 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తరువాత, చాలా బ్యాంకులు రుణాలు మరియు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD వడ్డీ రేట్లను సవరించాయి. ఇప్పటికే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కొటక్ మహీంద్రా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు వడ్డీ రేట్లను తగ్గించాయి.
ఈ నేపథ్యంలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జూన్ 15 నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs), సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలపై వడ్డీ రేట్లను సవరించింది. తాజా వడ్డీ రేట్ల సవరణ తర్వాత..
నిర్దిష్ట కాలపరిమితి గల 'అమృత్ వృష్ఠి' (444 రోజులు) పథకం వడ్డీ రేటును కూడా 6.85 శాతం నుంచి 6.60 శాతానికి సవరించారు. స్వల్ప కాలపరిమితి (7-45 రోజులు) విషయానికొస్తే, బ్యాంక్ - జూన్ 15 నుండి - గతంలో 3.30 శాతానికి బదులుగా 3.05 శాతం వడ్డీని మాత్రమే అందిస్తుంది.
46 నుంచి 179 రోజుల కాలపరిమితి గల డిపాజిట్లపై 5.30 శాతానికి బదులుగా ఇకపై 5.05 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. 180 నుంచి 210 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 6.05 శాతం నుంచి 5.80 శాతానికి తగ్గింది. కాలపరిమితి 211 రోజుల నుంచి ఏడాది లోపు ఉంటే వడ్డీ రేటు 6.30 శాతానికి బదులుగా 6.05 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు లభిస్తాయి. (మూలం: sbi.co.in)
Tenor | General citizens(%) | Senior citizens (%) |
---|---|---|
7-45 days | 3.05 | 3.55 |
46-179 days | 5.05 | 5.55 |
180-210 days | 5.80 | 6.30 |
211 to 1 year | 6.05 | 6.55 |
1-2 years | 6.25 | 6.75 |
2-3 years | 6.45 | 6.95 |
3-5 years | 6.30 | 6.80 |
5-10 years | 6.05 | 7.05* |
సంబంధిత కథనం
టాపిక్