Airtel Tariff Hike : భారీగా పెరిగిన ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు.. ఊహించినట్టుగానే!
Airtel Tariff Hike new : రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్టు ఎయిర్టెల్ సంస్థ ప్రకటించింది. జియో ఇప్పటికే.. ధరలను పెంచేసింది.
ఎయిర్టెల్ వినియోగదారులకు అలర్ట్! రీఛార్జ్ ధరలను పెంచుతున్నట్టు దిగ్గజ టెలికాం సంస్థ ప్రకటించింది. పెంచిన ధరలు.. జులై 3 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసిది. రిలయన్స్ జియో సంస్థ.. తమ టారీఫ్‌లను పెంచుతున్నట్టు ప్రకటించిన కొన్ని గంటలకే.. ఎయిర్టెల్ కూడా ధరల పెంపుపై స్పష్టత ఇచ్చింది.
అయితే.. తాము రీఛార్జ్ ధరలు పెంచినా, కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా చూసుకున్నామని ఎయిర్టెల్ చెప్పింది.
“ఎంట్రీ లెవల్ ప్లాన్స్‌పై ఇప్పుడు ఒక మోస్తారు ధరలు (రోజుకు 70పైసలు) మాత్రమే పెంచాము. ఇది వినియోగదారులపై ఎక్కువ భారాన్ని చూపించదు.”
రీఛార్జ్ ప్లాన్స్ ఇలా పెరిగాయి..
2జీబీ డేటా, అన్లిమెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో 28 రోజుల వాలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్ రూ. 179 ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 199 అయ్యింది. 6జీబీ డేటాతో 84 రోజుల పాటు వచ్చే రూ. 455 ప్లాన్, ఇప్పుడు రూ. 509 అయ్యింది. ఇక 24జీబీ డేటాతో 365 రోజుల వాలిడిటీతో వచ్చే రూ. 1799 ప్లాన్.. రూ. 1999 అయ్యింది.
ఇక డైలీ డేటా ప్లాన్స్ విషయానికొస్తే.. 1జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతో (28 రోజులు) కూడిన రూ. 265 ప్లాన్ కాస్తా.. రూ. 299 అయ్యింది. 1.58జీబీతో (28 రోజులు) కూడిన రూ. 299 ప్లాన్ ఇప్పుడు రూ. 349 అయ్యింది. 2.5 జీబీతో (28 రోజులు) కూడిన రూ. 359 ప్లాన్.. రూ. 409 అయ్యింది. 3జీబీతో వచ్చే రూ. 399 ప్లాన్ ఇప్పుడు రూ. 449గా మారింది.
ఇక 56 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇచ్చే రూ. 479 ప్లాన్.. ఎయిర్టెల్ రీఛార్జ్ ధరల పెంపుతో రూ. 579 అయ్యింది. రోజుకు 2జీబీ డేటా ఇచ్చే రూ. 549 ప్లాన్.. రూ. 649 అయ్యింది.
84 రోజుల పాటు రోజుకు ర1.5జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇచ్చే రూ. 719 ప్లాన్ ధర రూ. 859 అయ్యింది. 2జీబీ డేటా ఇచ్చే రూ. 839 ప్లాన్ ధర ఏకంగా రూ. 979 అయ్యింది.
365 రోజుల పాటు రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఇచ్చే రూ. 2999 ప్లాన్ ఇప్పుడు రూ. 3599 అయ్యింది.
పెంచిన ధరల పూర్తి వివరాలు..
Updated Post-Paid tariff Plans Below
రిలయన్స్ జియో కూడా..
రిలయన్స్ జియో మొబైల్ రీఛార్జ్ ధరలు భారీగా పెంచింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ధరలు రెండూ పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు జులై 3 నుంచి అమల్లోకి రానున్నట్లు గురువారం ప్రకటించింది. దాదాపు అన్ని ప్లాన్‌లలో మొబైల్ సేవల రేట్లను పెంచింది. దాదాపుగా రెండున్నరేళ్ల తర్వాత జియో మొబైల్ రీఛార్జ్ రేట్లను పెంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వాస్తవానికి.. ఎయిర్టెల్, జీయో సంస్థలు టారీఫ్‌లను పెంచాలని ఎప్పటి నుంచో చూస్తున్నాయి. కానీ.. 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇంతకాలం ఆగాయి.
సంబంధిత కథనం