తక్కువ ధరకు ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటర్ కోసం చాలా మంది చూస్తుంటారు. ఇంట్లో స్కూటీ ఉంటే మహిళలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. బడ్జెట్ ధరలో మీరు స్కూటీ కొనాలనుకుంటే కొన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో హోండా యాక్టివా నుండి యమహా ఫాసినో 125 వరకు ఉన్నాయి. ఓసారి ఆ లిస్టు ఏంటో చూద్దాం..
సుజుకి యాక్సెస్ 125 కూడా మార్కెట్లో బాగా ఫేమస్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.82,900 నుండి రూ.94,500 మధ్య ఉంటుంది. ఇందులో 124సీసీ ఇంజిన్ ఉంది. 8.42 పీఎస్ శక్తిని, 10.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 45 కి.మీ. ఈ స్కూటర్‌లో ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, ముందు భాగంలో డ్యూయల్ యుటిలిటీ పాకెట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకి యాక్సెస్ డిస్క్, డ్రమ్ బ్రేక్ ఎంపికలలో లభిస్తుంది.
టీవీఎస్ జూపిటర్ 110 అనేది భారత మార్కెట్లో ఒక ప్రసిద్ధ స్కూటర్. దీని ధర ఎక్స్-షోరూమ్ రూ.76,691 నుండి రూ.89,791 మధ్య ఉంటుంది. ఇందులో 113.3 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. 50 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, ఆటో-కట్ టర్న్ ఇండికేటర్, డిస్టెన్స్ టూ ఎంప్టీ, వాయిస్ కమాండ్స్, హజార్డ్ ల్యాంప్, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 82 కి.మీ. ఈ స్కూటర్ అద్భుతమైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది.
హోండా యాక్టివా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.78,684 నుండి రూ.84,685 వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. ఇందులో 109.51సీసీ ఇంజిన్ ఉంది. ఈ స్కూటర్ లీటరుకు 59.5 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీని గరిష్ట వేగం గంటకు 85 కి.మీ. సేఫ్టీ కోసం ఇది సెమీ డిజిటల్ క్లస్టర్, డ్రమ్ బ్రేక్‌ల సౌకర్యాన్ని కలిగి ఉంది. దీని నిర్మాణ నాణ్యత, తక్కువ నిర్వహణ కారణంగా ఫ్యామిలీలు దీనిని ఎక్కువగా తీసుకుంటాయి.
యమహా ఫాసినో 125 చౌకైన స్కూటర్. ఇందులో 125 సిసి ఇంజన్ ఉంది. ఇది 8.04 బీహెచ్‌పీ పవర్, 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 68.75 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 5.2 లీటర్లు. ఈ స్కూటర్‌లో ఒకసారి పెట్రోల్ నింపితే, మీరు 350 కి.మీ. కంటే ఎక్కువ దూరం సులభంగా ప్రయాణించవచ్చు. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 80,430 నుండి రూ. 96,650 వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది.
ఈ స్కూటర్ ధర రూ.73,212 నుండి రూ.78,162 వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. ఇందులో 109.51 సీసీ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 7.9బీహెచ్‌పీ శక్తిని, 9.03 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ లీటరుకు 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ వంటి లక్షణాలను కలిగి ఉంది. ఇది యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా కలిగి ఉంది. ఇది రైడర్‌లు ప్రయాణంలో ఉన్నప్పుడు వారి స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.