Afcons Infrastructure IPO: ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ; జీఎంపీ బావుంది.. అప్లై చేయొచ్చా?-afcons infrastructure ipo gmp price date review other details in 10 points ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Afcons Infrastructure Ipo: ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ; జీఎంపీ బావుంది.. అప్లై చేయొచ్చా?

Afcons Infrastructure IPO: ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ; జీఎంపీ బావుంది.. అప్లై చేయొచ్చా?

Sudarshan V HT Telugu

Afcons Infrastructure IPO: ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ అక్టోబర్ 25న మార్కెట్లోకి వస్తోంది. గ్రే మార్కెట్లో ఈ కంపెనీ షేర్లు, గురువారం, అక్టోబర్ 24న రూ.76 ప్రీమియంతో లభిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఐపీఓకు అప్లై చేయొచ్చో లేదో ఇక్కడ తెలుసుకుందాం.

ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ (Photo: Courtesy company website)

Afcons Infrastructure IPO: అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఐపీఓ 2024 అక్టోబర్ 25న భారత ప్రైమరీ మార్కెట్లోకి రానుంది. ఈ పబ్లిక్ ఇష్యూ 2024 అక్టోబర్ 29 వరకు తెరిచి ఉంటుంది. ఈ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ను ఈక్విటీ షేరుకు రూ.440 నుంచి రూ.463గా నిర్ణయించింది. ఈ ఐపీఓ తో రూ.5,430 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకోగా, ఇందులో రూ.4,180 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కేటాయించారు. మిగిలిన రూ.1,250 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా కేటాయిస్తారు.

ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ జీఎంపీ

ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ (IPO) సబ్స్క్రిప్షన్ ప్రారంభ తేదీకి ముందు, కంపెనీ షేర్లు గ్రే మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ రోజు గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.76 ప్రీమియంతో లభిస్తున్నాయని స్టాక్ మార్కెట్ (stock market) పరిశీలకులు చెబుతున్నారు.

ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ వివరాలు

1] అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ జీఎంపీ: ఈ రోజు గ్రే మార్కెట్లో కంపెనీ షేర్లు రూ.76 ప్రీమియంతో లభిస్తున్నాయి.

2] ఇన్ఫ్రా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు రూ .440 నుండి రూ .463 గా ఉంది.

3] అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ తేదీ: బుక్ బిల్డ్ ఇష్యూ 2024 అక్టోబర్ 25న ప్రారంభమై 2024 అక్టోబర్ 29 వరకు అందుబాటులో ఉంటుంది.

4] ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ పరిమాణం: ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ .5,430 కోట్లు సేకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో కొత్త షేర్ల జారీ, ఓఎఫ్ఎస్ ఉంటాయి.

5] ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపిఒ లాట్ పరిమాణం: ఒక బిడ్డర్ లాట్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్ లో 32 కంపెనీ షేర్లు ఉంటాయి.

6] ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ కేటాయింపు తేదీ: షేర్ల కేటాయింపుకు 2024 అక్టోబర్ 30 న జరిగే అవకాశం ఉంది.

7] అఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ రిజిస్ట్రార్: లింక్ ఇన్టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ అధికారిక రిజిస్ట్రార్ గా నియమితులయ్యారు.

8. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ లీడ్ మేనేజర్లు: ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డ్యామ్ క్యాపిటల్ అడ్వైజర్స్, జెఫరీస్ ఇండియా, నోమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా), నువామా వెల్త్ మేనేజ్మెంట్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ ఈ బుక్ బిల్డ్ ఆఫర్ లీడ్ మేనేజర్లుగా నియమితులయ్యారు.

9. ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపీఓ లిస్టింగ్: దీపావళి సందర్భంగా నవంబర్ 1న స్టాక్ మార్కెట్ సెలవు కావడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఈ కంపెనీ షేర్లు నవంబర్ 4, 2024 న లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

10] ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐపిఒ సమీక్ష: 2024 ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ వార్షిక ఆదాయంలో 6 శాతం పెరుగుదలను నివేదించింది. దాని నికర లాభం 9 శాతం పెరిగింది.