Loan on Aadhar card : అర్జెంట్‌గా డబ్బులు కావాలా? ఆధార్ కార్డ్ ఉంటే చాలు రూ. 50వేల వరకు లోన్..
PM Svanidhi Yojana : మీ వ్యాపార అవసరాల కసం అర్జెంటుగా డబ్బులు కావాలా? అయితే ఇది మీకోసమే! ఎలాంటి పుచికత్తు లేకుండా, కేవలం ఆధార్ కార్డు ఉంటే చాలు.. పీఎం స్వనిది యోజన కింద లోన్ తీసుకోవచ్చు. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో ఊహించలేము! మరీ ముఖ్యంగా వ్యాపారాలకు క్యాష్ ఫ్లో చాలా అవసరం. మీరు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! ఎలాంటి గ్యారంటీ లేకుండా, కేవలం ఆధార్ కార్డుతో మీరు రుణం పొంది, మీ వ్యాపార అవసరాలను తీర్చుకునేందుకు కేంద్రం గతంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే.. ప్రధానమంత్రి స్వనిధి యోజన. ఈ స్కీమ్ వివరాలు, అర్హత వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాము..
పీఎం స్వనిధి యోజన..
కోవిడ్-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి ప్రధాన మంత్రి స్వనిధి యోజన (పీఎం స్వనిధి యోజన) పథకాన్ని 2020లో కేంద్రం ప్రవేశపెట్టారు. చిరువ్యాపారులు, వీధి వ్యాపారులు స్వావలంబన సాధించాలన్నది ఈ స్కీమ్ ముఖ్యం ఉద్దేశం.
ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి పూచికత్తు లేకుండా ఆధార్ కార్డుతో రూ. 50వేల వరకు రుణం పొందవచ్చు.
పీఎం స్వనిధి యోజన ఎలా పనిచేస్తుంది?
పీఎం స్వనిధి యోజన కింద.. ప్రారంభంలో వ్యాపారులకు రూ.10 వేల వరకు రుణం ఇస్తారు. ఈ రుణాన్ని తిరిగి చెల్లిస్తే వచ్చేసారి రూ.20,000 పొందవచ్చు. అంతేకాకుండా ఆ రుణాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఈ మొత్తాన్ని రూ.50,000కు పెంచుతారు.
పీఎం స్వనిధి పథకం కింద లోన్ పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. వ్యాపారులు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రుణాన్ని వాయిదాల పద్ధతిలో 12 నెలల్లోగా తిరిగి చెల్లించాలి.
లోన్ అప్లికేషన్‌కి ఇవి కావాల్సిందే..
ప్రధాన మంత్రి స్వనిధి వెబ్సైట్ ప్రకారం.. రుణ దరఖాస్తు ఫారం (ఎల్ఏఎఫ్) నింపడానికి అవసరమైన సమాచార పత్రాలను రుణగ్రహీతలు అర్థం చేసుకోవాలి.
మొబైల్ నంబర్ని ఆధార్త లింక్ చేయండి..
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ-కేవైసీ/ ఆధార్ ధ్రువీకరణకు మొబైల్ నంబర్ని ఆధార్ నంబర్‌కి లింక్ చేయడం తప్పనిసరి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి భవిష్యత్ ప్రయోజనాల కోసం రుణగ్రహీతలు పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) నుంచి సిఫారసు లేఖను పొందాల్సి ఉంటుంది.
మొబైల్ నంబర్లను అప్డేట్ చేయడానికి ఒక ఫారం నింపాలి. అంతే! మరే ఇతర డాక్యుమెంట్ అవసరం లేదు.
ఎలిజిబిలిటీ స్టేటస్‌ని తనిఖీ చేయండి..
ఈ పథకంలో రుణం పొందడానికి అర్హత కలిగిన నాలుగు కేటగిరీల వెండర్లు ఉన్నారు. అర్హతా ప్రమాణాలను పరిశీలించి తదనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మూడు దశలను అనుసరించిన తరువాత, పోర్టల్లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించవచ్చు. రుణగ్రహీతలు నేరుగా పోర్టల్లో లేదా తమ ప్రాంతానికి సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
వడ్డీ రేట్లు..
షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (ఆర్ఆర్బీలు), స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (ఎస్ఎఫ్బీలు), సహకార బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ప్రస్తుత రేట్ల ప్రకారమే ఉంటాయి. ఎన్బీఎఫ్సీలు, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐలు మొదలైన వాటికి వడ్డీ రేట్లు సంబంధిత రుణదాత కేటగిరీకి ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఎంఎఫ్ఐలు (నాన్ ఎన్బీఎఫ్సీ), ఆర్బిఐ మార్గదర్శకాల పరిధిలోకి రాని ఇతర రుణదాత వర్గాలకు.. ఈ పథకం కింద వడ్డీ రేట్లు ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐల కోసం ప్రస్తుత ఆర్బిఐ మార్గదర్శకాల ప్రకారం వర్తిస్తాయి.
సంబంధిత కథనం