Aadhaar Update : ఆధార్ ఫ్రీగా అప్‌డేట్ చేసేందుకు మరో 10 రోజులు మాత్రమే టైమ్.. తర్వాత డబ్బులే!
Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ కోసం చివరి తేదీగా సెప్టెంబర్ 14 ఉంది. అంటే ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేయకపోతే తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఆధార్ కార్డు హోల్డర్లు సెప్టెంబర్ 14 వరకు తమ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యూఐడీఏఐ కల్పిస్తోంది. మరికొన్ని రోజుల్లో సమాచారం అప్డేట్ చేయకపోతే తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్లు ఇంట్లో కూర్చొని సులభంగా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు. ఇది సెప్టెంబర్ 14 వరకు పూర్తిగా ఉచితమని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఎఐ) స్పష్టంగా పేర్కొంది. అంటే ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
మరికొన్ని రోజులే
సెప్టెంబర్ 14కు కేవలం 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోతే, మీరు దీనికి రుసుము చెల్లించాలి తర్వాత అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా సమాచారం లేదా చిరునామాను అప్ డేట్ చేయాల్సి వస్తే, దానిని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. ఇది కాకుండా, బయోమెట్రిక్ అప్డేట్ కోసం, మీరు సమీపంలోని ఆధార్ కార్డు కేంద్రానికి వెళ్లి నిర్ణీత రుసుము చెల్లించాలి.
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేయడం ఎలా?
ముందుగా మీరు myaadhaar.uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
తరువాత మీ ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సహాయంతో లాగిన్ కావాలి.
ఇక్కడ నుంచి 'నేమ్/జెండర్/డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్' ఆప్షన్ ఎంచుకోవాలి.
తర్వాతి స్క్రీన్‌పై 'అప్డేట్ ఆధార్ ఆన్‌లైన్' పై క్లిక్ చేసిన తర్వాత డెమోగ్రఫీ ఆప్షన్ నుంచి చిరునామాను ఎంచుకోవాలి.
దీని తరువాత, 'ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్' పై క్లిక్ చేయండి.
అవసరమైన డాక్యుమెంట్లు, అడ్రస్ ప్రూఫ్ అప్‌లోడ్ చేసేటప్పుడు కొత్త అడ్రస్ రాసి పేమెంట్ చేయకుండానే రిక్వెస్ట్ సబ్మిట్ చేయాలి.
మీకు సర్వీస్ రిక్వెస్ట్ నెంబరు (SRN) వస్తుంది. దీని సహాయంతో అప్డేట్ స్టేటస్ చెక్ చేయవచ్చు. సమాచారం అప్డేట్ అయిన తర్వాత మీరు అధికారిక వెబ్‌సైట్ నుంచి కొత్త ఆధార్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు సమాచారం 10 ఏళ్లకు మించరాదని, దాన్ని అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.