Banks offering 7% to 7.50% interest: 7.5% వరకు వడ్డీ ఇచ్చే బ్యాంకులివే..-9 banks offering from 7 to 7 50 interest rates on savings accounts in 2022 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  9 Banks Offering From 7% To 7.50% Interest Rates On Savings Accounts In 2022

Banks offering 7% to 7.50% interest: 7.5% వరకు వడ్డీ ఇచ్చే బ్యాంకులివే..

HT Telugu Desk HT Telugu
Nov 19, 2022 05:15 PM IST

Banks offering 7% to 7.50% interest: సాధారణంగా బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోని నగదు మొత్తాలకు 3 % నుంచి 4% వరకు మాత్రమే వార్షిక వడ్డీ రేటు ఇస్తుంటాయి. అయితే, కొన్ని బ్యాంకులు మాత్రం సేవింగ్స్ ఖాాతాలకు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Banks offering 7% to 7.50% interest: సాధారణంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల వడ్డీని రోజువారీగా లెక్కించి, మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తుంటారు. సేవింగ్స్ ఖాతాలకు ఆకర్షణీయమైన వడ్డీ ఇస్తున్న బ్యాంకులు కొన్ని ఉన్నాయి. అవి 7% నుంచి 7.5% వరకు వార్షిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

Ujjivan Small Finance Bank ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.5%

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సేవింగ్స్ ఖాతాలకు అత్యధిక వార్షిక వడ్డీ రేటు ఇస్తున్న బ్యాంక్ ఇదే. ఈ బ్యాంక్ 7.5% వరకు వార్షిక వడ్డీ రేటు ఇస్తోంది. అయితే, కనీసం రూ. 25 కోట్లు పై బడిన మొత్తాలకే ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

DCB Bank డీసీబీ బ్యాంక్ 7%

డీసీబీ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేటు ఇస్తోంది. రూ. 25 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉన్న ఖాతాలకు ఈ బ్యాంక్ 7% వార్షిక వడ్డీ రేటుతో వడ్డీ అందిస్తోంది.

Jana Small Finance Bank జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7%

నవంబర్ 15 నుంచి జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 1 లక్ష పైబడిన సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ 7% వడ్డీ ఇస్తోంది.

Equitas Small Finance Bank: ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7%

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా సేవింగ్స్ ఖాతాలపై వడ్డీని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన వడ్డీ రేట్లు నవంబర్ 8 నుంచి అమల్లోకి వస్తాయి. రూ. 5 లక్షలు పైబడిన సేవింగ్స్ బ్యాలెన్స్ పై 7% వడ్డీని ఈ బ్యాంక్ అందిస్తోంది.

AU Small Finance Bank: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7%

ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా కస్టమర్లకు మంచి వడ్డీ రేటును ప్రకటించింది. రూ. 25 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య సేవింగ్స్ మొత్తాలపై 7% వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తోంది. అంతేకాదు, సేవింగ్స్ ఖాతాలపై రోజువారీగా వడ్డీని లెక్కగట్టి, ప్రతీ నెలాఖరున ఖాతాలో జమ చేస్తుంది. వడ్డీగా లభించిన ఈ మొత్తంపై కూడా తదుపరి నెల వడ్డీని లెక్కిస్తారు.

Fincare Small Finance Bank: ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7%

ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెంచిన వడ్డీ రేట్లు 2021 జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. రూ. 5 లక్షల నుంచి రూ. 1 కోటి వరకు ఉన్న సేవింగ్స్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ 7% వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఇవి కాకుండా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లు కూడా సేవింగ్స్ ఖాతాల కస్లమర్లకు మంచి వడ్డీని అందిస్తున్నాయి.

WhatsApp channel