స్టాక్ మార్కెట్లో భారీ సంపదను సృష్టించుకోవాలంటే అది దీర్ఘకాల పెట్టుబడులతోనే సాధ్యం అవుతుందని నిపుణులు చెబుతుంటారు. ఒక మంచి స్టాక్‌ని ఎంచుకుని, చాలా కాలం పాటు దానితో జర్నీ చేస్తే మనకి అద్భుత రిటర్నులు వస్తాయి. అనేక మల్టీబ్యాగర్ స్టాక్స్ ఈ విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేశాయి. ఈ తరహా మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటి ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్! ఇదొక మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్. కేవలం 3ఏళ్లల్లోనే రూ. 1లక్ష ఇన్వెస్ట్‌మెంట్‌ని రూ. 10లక్షలు చేసిన స్టాక్ ఇది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ స్టాక్ మూడేళ్ల క్రితం రూ.8.01గా ఉండేది. ఏప్రిల్ 11తో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో ఈ స్టాక్ ధర రూ.81.73 వద్ద ముగిసింది.
ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ ఇటీవలి దశాబ్దాల్లో భారత స్టాక్ మార్కెట్ అందించిన వెల్త్ క్రియేటింగ్ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్‌లో ఒకటి. ఎవరైనా 2022 ఏప్రిల్ 11 న ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ షేర్లను రూ .8.01కు కొనుగోలు చేసి, ఈ రోజు వరకు దానిని కొనసాగించి ఉంటే, వారి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మూడేళ్లలో 920 శాతం పెరిగి ఉండేది!
గత ఏడాది కాలంలో కొంత అమ్మకాల ఒత్తిడిని చూసినప్పటికీ ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో తాజాగా కొనుగోళ్లు జరిగాయి. గత నెలలో ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ షేరు ధర 20 శాతం పెరిగింది. కాగా గత ఏడాదితో పోలిస్తే ఈ స్టాక్ 9 శాతం క్షీణించింది. అయితే, పెద్ద కాలపరిమితిని పరిగణనలోకి తీసుకుంటే, గత మూడేళ్లలో ఈ స్టాక్ 920 శాతం వృద్ధిచెందింది.
గత ఏడాది నవంబర్ 11న 52 వారాల గరిష్ట స్థాయి రూ.162.95 నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 7న రూ.59.93 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది.
ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ షేర్ ప్రైజ్ హిస్టరీని పరిగణనలోకి తీసుకుంటే ఒక ఇన్వెస్టర్ నెల రోజుల క్రితం ఈ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని విలువ రూ.1.20 లక్షలకు మారి ఉండేది. అయితే ఏడాది క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడిదారుడు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే, అది రూ.91,000కు పడిపోయేది. మరోవైపు, గత మూడేళ్లలో పెట్టుబడిదారుడు పెట్టిన రూ .1 లక్ష నేడు రూ .10.20 లక్షలు అయ్యేది.
పేర్కొన్న కాలమంతా ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో పెట్టుబడి పెట్టినప్పుడు మాత్రమే ఈ రాబడులు సాధ్యమవుతాయి.
ఆల్ఫా ట్రాన్స్ఫార్మర్స్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.74.79 కోట్లు. అంటే ఇదొక స్మాల్ క్యాప్ స్టాక్.
అయితే, ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ‘మల్టీబ్యాగర్’ ట్యాగ్ ఒక్కటే సరిపోదు. సంస్థపై ఫండమెంటల్ ఎనాలసిస్ చేసి తెలుసుకోవాలి.
సంబంధిత కథనం