Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..-8 stocks to buy today day trading guide for tuesday november 15 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  8 Stocks To Buy Today, Day Trading Guide For Tuesday November 15

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. నేటి 'స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 08:16 AM IST

Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..

ట్రేడర్స్​ అలర్ట్​.. ‘నేటి స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే..
ట్రేడర్స్​ అలర్ట్​.. ‘నేటి స్టాక్స్​ టు బై' లిస్ట్​ ఇదే.. (iStock)

Stocks to buy today : సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఒడుదొడుకులకు లోనైన దేశీయ సూచీలు.. చివరికి నష్టాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​.. 171పాయింట్ల నష్టంతో 61,624 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 21పాయింట్లు కోల్పోయి 18,329 వద్దకు చేరింది. బీఎస్​ఈ మిడ్​ క్యాప్​, స్మాల్​ క్యాప్​ సూచీలు స్వల్పంగా లాభపడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​లో అప్​ట్రెండ్​లోనే కొనసాగుతోంది. 18,350 మార్కు వద్ద స్వల్పంగా రెసిస్టెన్స్​ కనిపిస్తోంది. ఈ ఒడుదొడుకులు మరో 1-2 సెషన్ల వరకు కొనసాగవచ్చు. ఆ తర్వాత మార్కెట్లు మరింత పైకి వెళ్లొచ్చు. మదుపర్లు బై ఆన్​ డిప్​ స్ట్రాటజీని అమలు చేయవచ్చు. స్వల్ప కాలంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. 18,250 లెవల్​ సపోర్టుగా ఉందని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన టెక్నికల్​ రీసెర్చ్​ అనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు. ఆ లెవల్​ పైన ఉన్నంత వరకు నిఫ్టీని అప్​ట్రెండ్​లోనే చూడవచ్చని స్పష్టం చేశారు.

IRCTC Q2 results పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఎస్​జీఎక్స్​ నిఫ్టీ..

దేశీయ స్టాక్​ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ.. 36పాయింట్ల లాభంలో ఉండటమే ఇందుకు కారణం.

స్టాక్స్​ టు బై..

  • Stocks to buy : జేకే పేపర్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 412, టార్గెట్​ రూ. 440
  • టెక్​ మహీంద్రా:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1046, టార్గెట్​ రూ. 1111
  • గ్రాసిమ్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1710, టార్గెట్​ రూ. 1820
  • ఇండస్​ఇండ్​ బ్యాంక్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1125, టార్గెట్​ రూ. 1195
  • విప్రో:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 384, టార్గెట్​ రూ .410
  • టాటా స్టీల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 103, టార్గెట్​ రూ. 115
  • సీడీఎస్​ఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1220, టార్గెట్​ రూ. 1300
  • వర్ల్​పూల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1590

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

WhatsApp channel

సంబంధిత కథనం