5ఏళ్లల్లో 750శాతం పెరిగిన స్మాల్​ క్యాప్​ స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..-750 percent jump in 5 years this small cap stock declares 1 5 stock split and fundraise ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  5ఏళ్లల్లో 750శాతం పెరిగిన స్మాల్​ క్యాప్​ స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..

5ఏళ్లల్లో 750శాతం పెరిగిన స్మాల్​ క్యాప్​ స్టాక్​ ఇది- ఇప్పుడు బిగ్​ అప్డేట్​..

Sharath Chitturi HT Telugu

5ఏళ్లల్లో 750శాతం వరకు పెరిగిన మల్టీబ్యాగర్​ స్మాల్​ క్యాప్​ స్టాక్​ నుంచి ఇప్పుడు రెండు బిగ్​ అప్డేట్స్​ వచ్చాయి. కెల్టన్ టెక్ సొల్యూషన్స్ స్టాక్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

5ఏళ్లల్లో 750శాతం వరకు పెరిగిన స్టాక్​ ఇది.. (Agencies)

గత ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రాబడులను అందించిన స్మాల్-క్యాప్ స్టాక్ కెల్టన్ టెక్ సొల్యూషన్స్ (Kellton Tech Solutions) నుంచి ఇప్పుడు ఒక బిగ్​ అప్డేట్​ వచ్చింది! స్టాక్ స్ల్పిట్​, ఫండర్​ రైజింగ్​ ప్రణాళికలను సంస్థ తాజాగా ప్రకటించింది. ఫలితంగా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఈ స్టాక్​ ఫోకస్​లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

స్మాల్​ క్యాప్​ స్టాక్​ నుంచి బిగ్​ అప్డేట్​..

వారెంట్లను జారీ చేసి కేటాయించడం ద్వారా నిధులు సమీకరించాలని జూన్ 14, 2025 శనివారం జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు. అలాగే, 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్​ను సైతం సిఫార్సు చేశారు. ఈ విషయాలపై వాటాదారుల ఆమోదం పొందేందుకు జులై 11, 2025 శుక్రవారం కంపెనీ ఎక్స్​ట్రా- ఆర్డినర్​ జనరల్​ మీటింగ్​ (ఈజీఎం)ని నిర్వహించనున్నారు.

కెల్టన్ టెక్ సొల్యూషన్స్ స్టాక్ స్ల్పిట్​ వివరాలు:

కంపెనీ బోర్డు 1:5 నిష్పత్తిలో స్టాక్ స్ల్పిట్​కు ఆమోదం తెలిపింది. దీని అర్థం, రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి షేరు, రూ1 ముఖ విలువ కలిగిన ఐదు ఈక్విటీ షేర్లుగా డివైడ్​ అవుతుంది. ఇవి ఫుల్లీ పెయిడ్​ షేర్లు.

ఈజీఎం ద్వారా వాటాదారుల ఆమోదం పొందిన తర్వాత షేర్ల సబ్​డివిజన్​ కోసం రికార్డు తేదీని నిర్ణయిస్తారు.

స్టాక్ స్ల్పిట్ ముఖ్య ఉద్దేశం.. కంపెనీ ఈక్విటీ షేర్ల లిక్విడిటీని పెంచడం. అలాగే షేర్లను మరింత సరసమైనవిగా చేయడం ద్వారా చిన్న, రిటైల్ పెట్టుబడిదారుల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం!

ప్రస్తుతం 12 కోట్ల షేర్లుగా (ఒక్కొక్కటి రూ. 5 ముఖ విలువ) ఉన్న కంపెనీ అధీకృత వాటా మూలధనం ప్రతిపాదిత స్టాక్ స్ల్పిట్​ తర్వాత ఒక్కొక్కటి రూ.1 ముఖ విలువ కలిగిన 60 కోట్ల షేర్లకు పెరుగుతుంది. అయితే, మొత్తం అధీకృత మూలధనం రూ.60 కోట్లుగా ఎటువంటి మార్పు లేకుండా ఉంటుంది.

కెల్టన్ టెక్ సొల్యూషన్స్ నిధుల సమీకరణ:

కంపెనీ కొన్ని ప్రమోటర్, నాన్-ప్రమోటర్ పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ప్రాతిపదికన 55 లక్షల వారెంట్లను జారీ చేసి కేటాయించడం ద్వారా నిధులు సమీకరించాలని ప్రతిపాదించింది.

మొత్తం నిధుల సమీకరణ రూ.69.3 కోట్లు వరకు ఉంటుంది. అయితే, దీనికి నియంత్రణ, చట్టబద్ధమైన అధికారులు, అలాగే రాబోయే ఈజీఎంలో కంపెనీ సభ్యుల ఆమోదం అవసరం.

కన్వర్టిబుల్ వారెంట్ల జారీ తర్వాత, కంపెనీలో ప్రమోటర్ మాట్నిక్ ఫిన్వెస్ట్ ఎల్​ఎల్​పీ వాటా 35.74 శాతం నుంచి 38.20 శాతానికి పెరుగుతుంది. నాన్-ప్రమోటర్ పెట్టుబడిదారులలో, కరంజిత్ సింగ్ వాటా 0.10 శాతం నుంచి 0.77 శాతానికి పెరుగుతుంది, శ్రీనివాస్ పోట్లూరి వాటా 0.34 శాతం నుంచి 0.62 శాతానికి పెరుగుతుంది.

కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేర్ ప్రైజ్​ హిస్టరీ:

కెల్టన్ టెక్ సొల్యూషన్స్ షేర్ ధర గత ఐదేళ్లలో 742 శాతం గణనీయమైన మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. గత సంవత్సరంలో, ఈ స్మాల్-క్యాప్ స్టాక్ 30 శాతం పెరిగింది!

ఈ స్టాక్ ఈ ఏడాది ఏప్రిల్ 7న రూ.95.05 వద్ద 52 వారాల కనిష్ట స్థాయిని తాకింది. గత ఏడాది జులై 15న రూ.184.30 వద్ద 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి కంపెనీ షేరు రూ. 131 వద్ద ముగిసింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం