New Royal Enfield bikes : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్స్ లిస్ట్​- ఓ లుక్కేయండి!-6 new royal enfield bikes to launch in india check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  6 New Royal Enfield Bikes To Launch In India, Check Full Details

New Royal Enfield bikes : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్స్ లిస్ట్​- ఓ లుక్కేయండి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 28, 2022 10:32 AM IST

New Royal Enfield bikes 2022 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్స్​ లాంచ్​ చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఆ వివరాలు చూసేయండి..

రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్స్​.. ఓ లుక్కేయండి!
రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్స్​.. ఓ లుక్కేయండి! (HT Auto)

New Royal Enfield bikes 2022 : రాయల్​ ఎన్​ఫీల్డ్​.. ఈ పేరు వింటేనే బైక్​ లవర్స్​కు కిక్​ వచ్చేస్తుంది! ఇక రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్​ మీద చక్కర్లు కొట్టాలని యువత కలలు కంటుంది. అందుకు తగ్గట్టుగానే కొత్త బైక్స్​తో ఎప్పటికప్పుడు భారతీయులను పలకరిస్తుంది రాయల్​ ఎన్​ఫీల్డ్​. ఇక ఇప్పుడు రాయల్​ ఎన్​ఫీల్డ్​కి సంబంధించి అదిరిపోయే వార్త ఒకటి బయటకొచ్చింది. ఇండియా మార్కెట్​లోకి త్వరలోనే కొత్త బైక్స్​ను లాంచ్​ చేసేందుకు రాయల్​ ఎన్​ఫీల్డ్​ సన్నద్ధమవుతోంది! బైక్స్​ వివరాలు చూసేద్దామా..

ట్రెండింగ్ వార్తలు

బుల్లెట్​ 350

Royal Enfield Bullet 350 : జే ఫ్లాట్​ఫామ్​ మీద వస్తున్న చివరి బైక్​ ఈ బుల్లెట్​ 350. ప్రస్తుతం ఉన్న యూసీఈ బుల్లెట్ 350ని ఇది రిప్లేస్​ చేస్తుంది. ఇటీవలే లాంచ్​ అయిన హంటర్​ 350 కన్నా మించి ఇది ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. దీని ఇంజిన్​, ఛాసీస్​ క్లాసిక్​ 350తో పోలి ఉంటుందని, అయితే డిజైన్​లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.

హిమాలయన్​ 450

Royal Enfield Himalayan 450 : హిమాలయన్​ కొత్త వర్షెన్​పై రాయల్​ ఎన్​ఫీల్డ్​ కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న దాని కన్న కొత్త వర్షెన్​ మరింత పవర్​ఫుల్​ అని తెలుస్తోంది. ఇది 450సీసీ కెపాసిటీ బైక్​ అని సమాచారం. ప్రస్తుతం 411సీసీ కెపాసిటీ మాత్రమే ఉంది. మరీ ముఖ్యంగా.. హిమాలయన్​ 450లో లిక్విడ్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఇలాంటి ఇంజిన్​ను వాడటం ఇదే తొలిసారి అవుతుంది.

స్క్రామ్​ 450

Royal Enfield Scram 450 : హిమాలయన్​ 450ని కొద్దిగా మాడిఫై చేసి స్క్రామ్​ 450ని తీసుకొచ్చేందుకు రాయల్​ ఎన్​ఫీల్డ్​ ప్రణాళికలు రచిస్తోంది! అలాయ్​ వీల్స్​, సింగిల్​ పీస్​ డిజైన్​ ఇందులో ఉండొచ్చు.

సూపర్​ మెటియోర్​ 650

Royal Enfield Super Meter 650 : ఇది రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లాగ్​షిప్​ క్రూజర్​. ఫార్వర్డ్​ సీట్​ ఫుట్​పెగ్స్​, అప్​ స్విఫ్ట్​ హ్యాండిల్​ బార్​, స్కూప్​డ్​ ఔట్​ సీట్​ ఇందులో ఉంటాయని తెలుస్తోంది.

షార్ట్​గన్​ 650

Royal Enfield Shortgun 650 : ఎస్​జీ650 కాన్సెప్ట్​ను రాయల్​ ఎన్​ఫీల్డ్​ ప్రదర్శించింది. దీనిని షార్ట్​గన్​ 650గా పిలుస్తారని తెలుస్తోంది. ఇందులో సింగిల్​ సీట్​, ఛాప్డ్​ ఫెండర్​, సెంటర్​ సెట్​ ఫుట్​ పెగ్స్​ ఉండొచ్చు.

స్క్రాంబిల్​ 650

Royal Enfield Scramble 650 : చెన్నైలో స్క్రాంబిల్​ 650 టెస్ట్​ డ్రైవ్​ జరిగినట్టు తెలుస్తోంది. ఇది చాలా ఆకర్షణీయమైన డిజైన్​తో వస్తోంది.

కాంటినెంటల్​ జీటీ 650

Continental GT 650 : ఇది కూడా టెస్ట్​ డ్రైవ్​ జరిగినట్టు సమాచారం ఉంది. ఇందులో టెయిల్​ ల్యాంప్​ డిజైన్​ కొత్తగా ఉంది.

ఒక్కో వర్షెన్​కు సంబంధించి ప్రస్తుతం పూర్తి వివరాలు లేవు. రాయల్​ ఎన్​ఫీల్డ్​.. వీటిపై డిటైల్స్​ను ప్రకటించాల్సి ఉంది. అప్పుడే కొత్త మోడల్స్​పై మరింత సమాచారం లభిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్