Changes for July 1 : జులై 1 నుంచి ఈ విషయాల్లో కీలక మార్పులు- ఈ డెడ్‌లైన్స్ గురించి తెలుసుకోండి..
Financial changes from July 1 : ఆర్థిక విషయం పరంగా ఈ జులై 1 నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అంతేకాదు కొన్ని డెడ్‌లైన్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు..
నేటితో జూన్ నెలకు ముగింపు పడనుంది. జులై 1తో కొత్త నెల ప్రారంభంతో పాటు దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రజలు తెలుసుకోవాల్సిన పలు డెడ్లైన్లు సైతం ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూడండి..
ప్రధాన గడువులు..
జూలై 1, 2024: ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డు నిబంధనలు, ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీలలో మార్పులు అమల్లోకి వస్తాయి.
జూలై 15, 2024: యాక్సిస్ బ్యాంకుకు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు మైగ్రేషన్ పూర్తి.
జూలై 20, 2024: యాక్టివ్‌గా లేని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లను మూతపడతాయి.
జూలై 31, 2024: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు చివరి తేదీ.
పేటీఎం వాలెట్ మూసివేత..
నిల్ బ్యాలెన్స్ ఉండి ఏడాదికి పైగా ఎలాంటి లావాదేవీలు చేయని వ్యాలెట్లను జూలై 20, 2024న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మూసివేయనుంది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. “గత 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలంగా ఎటువంటి లావాదేవీలు లేని, బ్యాలెన్స్ లేని అన్ని వ్యాలెట్లను ఇకపై మూసివేయనున్నట్లు దయచేసి గమనించండి. జూలై 20, 2024 చివరి తేదీ. ప్రభావిత వినియోగదారులందరికీ కమ్యూనికేషన్ పంపిస్తాము. వినియోగదారులు వారి వాలెట్‌ని మూసివేయడానికి ముందు 30 రోజుల నోటీసు వ్యవధి ఇస్తాము,” అని ఉంది.
ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ రూల్ మార్పులు..
జూలై 1, 2024 నుంచి ఎస్బీఐ కార్డ్ అనేక క్రెడిట్ కార్డులకు ప్రభుత్వానికి సంబంధించిన లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను పొందడాన్ని నిలిపివేయనుంది. ప్రభావిత కార్డులు:
ఎయిర్ ఇండియా ఎస్బీఐ ప్లాటినం కార్డు
ఎయిరిండియా ఎస్బీఐ సిగ్నేచర్ కార్డ్
సెంట్రల్ ఎస్బీఐ సెలెక్ట్ + కార్డు
చెన్నై మెట్రో ఎస్బీఐ కార్డ్
క్లబ్ విస్తారా ఎస్బీఐ కార్డ్
విస్తారా ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
ఢిల్లీ మెట్రో ఎస్బీఐ కార్డ్
ఎతిహాద్ గెస్ట్ ఎస్బీఐ కార్డ్
ఎతిహాద్ గెస్ట్ ఎస్బీఐ ప్రీమియర్ కార్డ్
ఫ్యాబ్ఇండియా ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్
ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్
ఐఆర్సీటీసీ ఎస్బీఐ కార్డ్ ప్రీమియర్
ముంబై మెట్రో ఎస్బీఐ కార్డ్
నేచర్స్ బాస్కెట్ ఎస్బీఐ కార్డ్
నేచర్స్ బాస్కెట్ ఎస్బీఐ కార్డ్ ఎలైట్
ఓలా మనీ ఎస్బీఐ కార్డ్
పేటిఎం ఎస్బీఐ కార్డ్
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్
రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రైమ్
యాత్ర ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఛార్జీల సవరణలు..
జూలై 1, 2024 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వివిధ క్రెడిట్ కార్డ్ సర్వీస్ ఛార్జీలలో మార్పులను అమలు చేస్తుంది. ఎమరాల్డ్ ప్రైవేట్ మెటల్ క్రెడిట్ కార్డు మినహా అన్ని కార్డులకు కార్డు రీప్లేస్మెంట్ ఫీజును రూ.100 నుంచి రూ.200కు పెంచడం గమనార్హం. అదనంగా, ఈ క్రింది రుసుము నిలిపివేయనుంది..
చెక్/క్యాష్ పికప్ ఫీజు రూ.100 పిక్ అప్
ఛార్జ్ స్లిప్ రిక్వెస్ట్ ఫీజు రూ.100
డయల్-ఎ-డ్రాఫ్ట్ లావాదేవీ రుసుము డ్రాఫ్ట్ విలువలో 3 శాతం, కనీసం రూ.300
కనీసం రూ. 100తో కూడిన 1 శాతం చెక్ వాల్యూపై అవుట్ స్టేషన్ చెక్ ప్రాసెసింగ్ ఫీజు
3 నెలలు దాటిన డూప్లికేట్ స్టేటమెంట్ రిక్వెస్ట్ ఫీజు రూ. 100
ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) గడువు..
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను (అసెస్మెంట్ ఇయర్ 2024-25) ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ 2024 జూలై 31. ఈ గడువును కోల్పోయిన పన్ను చెల్లింపుదారులు డిసెంబర్ 31, 2024 లోగా ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేయవచ్చు.
పీఎన్బీ రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ మార్పులు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జూలై 1, 2024 నుంచి అమల్లోకి వచ్చే అన్ని రూపే ప్లాటినం డెబిట్ కార్డు వైవిధ్యాల కోసం లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లో మార్పులను ప్రకటించింది. అప్డేటెడ్ బెనిఫిట్స్:
- ప్రతి త్రైమాసికానికి ఒక డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లేదా రైల్వే లాంజ్ యాక్సెస్
- సంవత్సరానికి రెండు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్‌లు
- సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మైగ్రేషన్
యాక్సిస్ బ్యాంక్ జూలై 15, 2024 నాటికి క్రెడిట్ కార్డ్ సంబంధాలతో సహా అన్ని ఖాతాలను మైగ్రేట్ చేస్తామని సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు తెలియజేసింది.
హీరో మోటోకార్ప్ ధరల పెంపు..
కస్టమర్లకు షాక్ ఇస్తూ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హీరో మోటోకార్ప్.. తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు జులై 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వీటితో పాటు ఎయిర్టెల్, జీయో, వోడాఫోన్ఐడియాలు తీసుకున్న టారీఫ్ హైక్.. జులై మొదటి వారంలో అమల్లోకి వస్తాయి.
సంబంధిత కథనం