Digital gold: బంగారం.. నువ్వెక్కడ అంటే డిజిటల్‌లో అని చెప్పనా?-57 million users buying digital gold in festive season ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Digital Gold: బంగారం.. నువ్వెక్కడ అంటే డిజిటల్‌లో అని చెప్పనా?

Digital gold: బంగారం.. నువ్వెక్కడ అంటే డిజిటల్‌లో అని చెప్పనా?

HT Telugu Desk HT Telugu

Digital gold: ఈ తరం అంతా ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెడుతోందని తాజా పరిణామం చెబుతోంది.

డిజిటల్ గోల్డ్ రూపంలో పెట్టుబడులు పెడుతున్న యూత్ (PTI)

Digital gold: ప్రపంచం డిజిటల్ మయమైంది. ఇప్పుడు బంగారం కూడా. ఈ పండగ సీజన్‌లో డిజిటల్ గోల్డ్‌ కొన్న వారి సంఖ్య 57 లక్షలని సేఫ్‌గోల్డ్ సంస్థ సంబంధిత గణాంకాలు వెల్లడించింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం లావాదేవీల్లో 81 శాతం మగాళ్లు చేసినవే. మహిళలు చేసిన ట్రాన్సాక్షన్స్ 19 శాతమే. ఈ లావాదేవీలు జరిగిన నగరాల్లో ప్రధానంగా ముంబై, ఆ తరువాత హైదరాబాద్, ఢిల్లీ ఉన్నాయి.

ధన్‌తేరాస్ రోజు అక్టోబరు 22, 2022న సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల మధ్య డిజిటల్ గోల్డ్‌ కొనుగోలు చేసిన వారు ఎక్కువగా ఉన్నారు. కొందరు గిఫ్ట్స్ రూపంలో ఇచ్చారు. కొనుగోలుదారులంతా సగటు ఇండస్ట్రీ ప్రమాణాల ప్రకారం రూ. 1,95,00,000 మేర మేకింగ్ ఛార్జీలు ఆదా చేయగలిగారు.

దాదాపు 44 శాతం ట్రాన్సాక్షన్స్ యూపీఐ పద్ధతిలో జరిగాయి. ఇందులో ఒక ట్రాన్సాక్షన్ విలువ ఏకంగా రూ. 5,50,000 ఉండడం విశేషం. జనరేషన్-జడ్, 2000 సంవత్సరం తరువాత పుట్టిన వారు ఈ లావాదేవీలు జరిపిన వారిలో ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా 18-34 మధ్య వయస్సు గల వారు ఈ ఈ ఫెస్టివ్ సీజన్‌లో డిజిటల్ గోల్డ్ అమ్మకాలను పెంచేశారు.

డిజిటల్ గోల్డ్ అంటే ఫిజికల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే ఒక విధానం. రెగ్యులర్ గోల్డ్ తరహాలోనే కొనుగోలు చేయడం. కానీ కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లో కస్టమర్ డబ్బులు చెల్లిస్తే అమ్మకందారు ఆ మొత్తాన్ని తన వాల్ట్స్‌లో సేఫ్‌గా ఉంచుతారు. ఇందులో ఒక రూపాయి నుంచి ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అంటే ఒక రూపాయి విలువ గల 24 క్యారెట్ల హాల్‌మార్క్ గోల్డ్‌ను కూడా కొనుగోలు చేయొచ్చన్నట్టు.

సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్స్ కొనుగోలుదారులు డిజిటల్ గోల్డ్‌ కొనడం, అమ్మడం చేసేందుకు అనుమతిస్తాయి. 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఎంత తక్కువ మొత్తం ఉన్నా కొనుగోలు చేయవచ్చు. నిజమైన గోల్డ్ కొనుగోలు చేసినప్పుడు దానిని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో ఉపయోగించలేం. మేకింగ్ ఛార్జీలు, స్టోరేజ్ ఛార్జీలు వంటివన్నీ మన ఆస్తి విలువను తగ్గించేస్తాయి.

ఇక కేంద్రం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ అయితే ఏకంగా కొనుగోలుదారులకు వడ్డీ కూడా చెల్లిస్తాయి.

సావరిన్ గోల్డ్ బాండ్స్ గురించి ఇక్కడ చదవండి.