మీరు యూట్యూబ్ ఎక్కువగా వాడుతుంటారా? లైఫ్‌స్టైల్ నుంచి న్యూస్ అప్డేట్స్, ఫైనాన్స్ వరకు మీ గో-టూ ఆప్షన్ యూట్యూబ్ ఆ? కానీ యూట్యూబ్ యాడ్స్‌తో విసుగెత్తిపోయారా? మాటిమాటికి వస్తున్న యాడ్స్‌తో మీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ దెబ్బతింటోందా? అయితే ఇది మీకోసమే! సాధారణంగా యాడ్స్ ప్లే అవ్వకూడదంటే డబ్బులు కట్టి యూట్యూబ్ ప్రీమియం తీసుకోవాలి. కానీ మీకు తెలియని కొన్ని హ్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి, ప్రీమియం లేకుండానే, యాడ్స్‌ని సులభంగా తొలగించవచ్చు. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
యూట్యూబ్ యాడ్స్‌ని నివారించడానికి ఉన్న సింపుల్ టిప్స్‌లో ఒకటి వీడియోలను డౌన్లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో చూడటం. ప్రకటనలు మీ అనుభవానికి అంతరాయం కలిగిస్తాయి కాబట్టి, మీరు తిరిగి చూడటానికి ఇష్టపడే క్లిప్‌లకు ఇది అనువైనది. యూట్యూబ్ ఆఫ్‌లైన్‌లో వీడియోలను సేవ్ చేసే ఫీచర్‌ని అందిస్తుంది. కానీ ఇది ఉచిత వినియోగదారులకు కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది మీ ప్రాంతంలో అందుబాటులో ఉందో లేదో చెక్ చేయండి. ప్రత్యామ్నాయంగా, మీరు వీడియోలను యాడ్స్ లేకుండా చూడటానికి ఉచిత ఓపెన్ సోర్స్ డౌన్లోడర్ అయిన వైటీ-డీఎల్పీ వంటి థర్డ్-పార్టీ యాప్స్‌ని ఉపయోగించవచ్చు.
అన్-స్కిప్పబుల్ యాడ్స్‌తో ఒక్కోసారి చాలా చిరాకు వస్తుంది. దీనికి పరిష్కారం? యాడ్ బ్లాకర్స్! ఈ బ్రౌజర్ ఎక్స్టెంన్షన్స్ యూట్యూబ్ వీడియోల నుంచి ప్రకటనలను స్వయంచాలకంగా తొలగిస్తాయి. కాబట్టి మీరు అంతరాయాలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. క్రోమ్, ఫైర్ఫాక్స్ లేదా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఎక్స్టెన్షన్ స్టోర్స్‌లో యూబ్లాక్ ఆరిజిన్ లేదా యూట్యూబ్ యాడ్-స్కిప్పింగ్ వంటి ప్రసిద్ధ యాడ్ బ్లాకర్లను మీరు ఎంచుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత, బ్లాకర్ వెబ్‌పేజీని స్కాన్ చేస్తుంది. ప్రకటనలను లోడ్ చేయకుండా ఆపుతుంది.
ఇక్కడ ఒక సరళమైన- ప్రభావవంతమైన హ్యాక్ ఇంకొకటి ఉంది. ఈ ట్రిక్‌లో ".com" భాగం తరువాత, మీరు చూడాలనుకుంటున్న వీడియో URLకు ఒక (.) జోడించండి. ఈ చిన్న మార్పు యూట్యూబ్ యాడ్ వ్యవస్థను గందరగోళానికి గురి చేస్తుంది. ప్రకటనలను లోడ్ చేయకుండా అడ్డుకుంటుంది. ఉదాహరణకు..
ఒరిజినల్ URL:https://www.youtube.com/watch?v=xyz123
రివైజ్డ్ URL:https://www.youtube.com./watch?v=xyz123
మార్పు చేసిన తరువాత, ఎంటర్ నొక్కండి. మీరు వీడియోను ప్రకటన లేకుండా చూడగలరు.
మొబైల్ పరికరాల్లో ప్రకటనలను మాన్యువల్‌గా స్కిప్పింగ్ చేయడం విసుగు కలిగిస్తుంది. స్కిప్ యాడ్స్ బటన్ నొక్కడానికి వేచి ఉండటానికి బదులుగా, మీరు ప్రక్రియను ఆటోమేట్ చేయవచ్చు. ప్రకటన ప్రారంభమైనప్పుడు, స్క్రీన్‌ను ట్యాప్ చేసి, ఎడమ లేదా కుడికి స్వైప్ చేయండి. కొన్ని పరికరాల్లో, ఈ చర్య వెంటనే చిన్న ప్రకటనలను దాటవేస్తుంది. స్కిప్ యాడ్ బటన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దాన్ని కూడా ట్యాప్ చేయవచ్చు. అంతరాయం లేని అనుభవం కోసం, దీనిని మీ మొబైల్ బ్రౌజర్లోని యాడ్ బ్లాకర్‌తో కలపండి.
మీరు యూట్యూబ్‌లో ప్రకటనలతో అలసిపోయినట్లయితే, న్యూపైప్, పీర్ట్యూబ్ లేదా విమియో వంటి ప్రత్యామ్నాయ యాప్స్‌ని ఉపయోగించడాన్ని పరిగణించండి. ఈ యాప్స్ యాడ్స్ లేకుండా యూట్యూబ్ కంటెంట్ చూడటానికి అనుమతిస్తాయి. ఉదాహరణకు, న్యూపైప్ ట్రెండింగ్ క్లిప్‌లు, సబ్స్క్రిప్షన్లుస సేవ్ చేసిన ప్లేలిస్ట్లతో యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్‌ను అందిస్తుంది. ఇవన్నీ ప్రకటనలు లేకుండా! అయితే, న్యూపైప్ గూగుల్ విధానాలను ఉల్లంఘిస్తుంది కాబట్టి, మీరు దానిని గూగుల్ ప్లే స్టోర్‌లో కనుగొనలేరు. బదులుగా, దాని అధికారిక సైట్ లేదా గిట్‌హబ్ లేదా ఎఫ్-డ్రాయిడ్ వంటి రిపోజిటరీల నుండి డౌన్లోడ్ చేసుకోండి.
పైన చెప్పిన ఈ చిట్కాలు యూట్యూబ్‌లో అంతరాయాలను తగ్గించడానికి, పెయిడ్ సబ్స్క్రిప్షన్ అవసరాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఇవన్నీ ప్రతి యాడ్‌ని తొలగిస్తాయమని చెప్పలేము కానీ, మీ వ్యూయింగ్ ఎక్స్‌పీరియెన్స్ మాత్రం కచ్చితంగా మెరుగుపడుతుంది.
సంబంధిత కథనం