Mukesh Ambani Success Mantra : ముఖేష్ అంబానీ గెలుపు సూత్రాలు ఇవే.. మీరు ఫాలో అవ్వొచ్చు!-5 secret success tips to learn from mukesh ambani to get name and fame ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mukesh Ambani Success Mantra : ముఖేష్ అంబానీ గెలుపు సూత్రాలు ఇవే.. మీరు ఫాలో అవ్వొచ్చు!

Mukesh Ambani Success Mantra : ముఖేష్ అంబానీ గెలుపు సూత్రాలు ఇవే.. మీరు ఫాలో అవ్వొచ్చు!

Anand Sai HT Telugu Published Jul 11, 2024 02:30 PM IST
Anand Sai HT Telugu
Published Jul 11, 2024 02:30 PM IST

Mukesh Ambani Success Mantra : ముఖేష్ అంబానీ సక్సెస్ గురించి మాట్లాడితే, దాని వెనుక ఉన్న రహస్యం అతని కొన్ని సూత్రాలు. మీరు కూడా మీ జీవితంలో విజయాన్ని సాధించాలనుకుంటే మీ దినచర్యలో ముఖేష్ అంబానీ పాటించే కొన్ని అలవాట్లను ఫాలో కావాలి. అవి ఎవరికైనా ఉపయోగపడతాయి.

ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ (HT_PRINT)

దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం కావడంతో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. అయితే ఈసారి ఆయన వార్తల్లో నిలవడానికి కారణం ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్ ఫంక్షన్లు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కావాలనుకుంటే.. ప్రపంచంలోని అన్ని సౌకర్యాలు దొరుకుతాయి.. కానీ చాలా వరకు అతను సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు. ముఖేష్ అంబానీ స్వభావరీత్యా చాలా వినయంగా, ఫ్యామిలీ మ్యాన్ గా ఉంటారు. అతడు పాటించే కొన్ని సూత్రాలు విజయానికి కారణాలు. అవి మీరూ పాటించవచ్చు.

లక్ష్యాన్ని ఎప్పుడూ చిన్నదిగా ఉంచుకోవద్దు

ముఖేష్ అంబానీ స్వయంగా జీవితంలో తన కోసం ఏ చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఏదో ఒక మంచిని సాధించాలని ఎప్పుడూ తనను తాను నమ్మేవాడు. దాని ఫలితమే నేడు మనందరి ముందు కనిపిస్తుంది. ముఖేష్ అంబానీ ఎల్లప్పుడూ తన లక్ష్యాన్ని పెద్దదిగా ఉంచుతాడు. దానిని సాధించడానికి కష్టపడటానికి ప్రయత్నించాడు. తన లక్ష్యాలను సాధించాలనే తపన ఆయనకు ఎప్పుడూ ఉంటుంది.

టీమ్ వర్క్

ముఖేష్ అంబానీ టీమ్ వర్క్ ను నమడమే రిలయన్స్ ఇండస్ట్రీస్ విజయానికి అతిపెద్ద రహస్యం. అతడి ది బెస్ట్ టీమ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

పాజిటివ్ థింకింగ్

పాజిటివ్ థింకింగ్ తో అదృష్టాన్ని మార్చుకోవచ్చు. ఏ పని గురించైనా పాజిటివ్ గా ఆలోచిస్తేనే విజయం లభిస్తుందని ముఖేష్ అంబానీ నమ్ముతారు. అందుకే ప్రతి సందర్భంలోనూ పాజిటివ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. తన తండ్రి వల్లే ఆయనకు ఈ లక్షణాలు వచ్చాయి.

జనం వైపు నుంచి ఆలోచన

ఏ విజయవంతమైన వ్యక్తి అయినా ఎప్పుడూ జనం వైపు నుంచి ఆలోచించడం వల్లనే విజయం సాధిస్తారని ముఖేష్ అంబానీ అభిప్రాయం. జనాలకు ఏం కావాలో తెలుసుకుని మార్కెట్ చేసుకోవడమే విజయ రహస్యం. పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కూడా ఈ క్వాలిటీతో నిండి ఉన్నారు. దానివల్లే నేడు ప్రపంచం ముందు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మీరు కూడా జీవితంలో విజయవంతమైన వ్యక్తి కావాలనుకుంటే ఈ సూత్రాన్ని కచ్చితంగా ఫాలో అవ్వండి.

సమస్యకు మూలం

సమస్యలకు పరిష్కారం కనుగొనడం సమస్యను పరిష్కరించదు. సమస్య మూలాన్ని కనుగొనడానికి వ్యక్తి సమయాన్ని వెచ్చించాలని ముఖేష్ అంబానీ నమ్ముతారు. ఒక్కసారి సమస్య మూలం తెలిస్తే మీరే ఈజీగా పరిష్కరిస్తారు. అది వృత్తిపరమైన జీవితమైనా, వ్యక్తిగతమైనా, ఏదైనా సమస్యకు మూలాన్ని చేరుకోవడం అవసరం.

Whats_app_banner