త్వరలో రాబోయే 5 మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లు.. వచ్చాక మార్కెట్ షేక్!-5 most awaited adventure motorcycles coming soon is there a bike you like in this ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  త్వరలో రాబోయే 5 మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లు.. వచ్చాక మార్కెట్ షేక్!

త్వరలో రాబోయే 5 మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్లు.. వచ్చాక మార్కెట్ షేక్!

Anand Sai HT Telugu

భారతీయ వినియోగదారుల్లో ద్విచక్ర వాహనాల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2025 సంవత్సరం ప్రారంభంలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అనేక మోడళ్లు కూడా ప్రవేశించాయి. మరికొన్ని రోజుల్లో 5 అడ్వెంచర్ బైకులు రానున్నాయి.

ప్రతీకాత్మక చిత్రం

రాబోయే నెలల్లో చాలా ద్విచక్ర వాహనాలు భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 లో విడుదల చేయబోయే 5 మోస్ట్ అవైటెడ్ అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం..

బీఎమ్‌డబ్ల్యూ ఎఫ్450 జిఎస్

బీఎమ్‌డబ్ల్యూ ఎఫ్450 జిఎస్ కాన్సెప్ట్‌ను 2025 ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రవేశపెట్టారు. తాజాగా హోసూరులోని టీవీఎస్ ఫ్యాక్టరీ సమీపంలో ఇది కెమెరాకు చిక్కింది. 2025 చివరి త్రైమాసికంలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బీఎమ్‌డబ్ల్యూ బైక్‌లో సింగిల్ యూనిట్ హెడ్ ల్యాంప్స్, బీక్ లాంటి ఫ్రంట్ ఫెండర్స్, అల్లాయ్ వీల్స్ ఉంటాయి.

టీవీఎస్ ఆర్టీఎక్స్ 300

టీవీఎస్ 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఆర్టీఎక్స్ 300 కాన్సెప్ట్‌ను ప్రదర్శించింది. 2025 సెప్టెంబర్ లో దీన్ని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు తెలిసింది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్, లాంగ్ విండ్స్క్రీన్, స్ప్లిట్ సీట్ సెటప్ వంటి వివరాలతో ఈ ఏడీవీ బైక్‌ను పలుమార్లు పరీక్షించారు. పవర్ట్రెయిన్‌గా ఈ బైక్ సరికొత్త 299 సిసి లిక్విడ్-కూల్డ్ ఆర్టి-ఎక్స్‌డీ 4 ఇంజిన్‌తో పనిచేస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 750 సీసీ ఇంజిన్‌తో హిమాలయన్ వెర్షన్‌ను 2025 చివరి నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ బైక్ ఇప్పటికే టెస్టింగ్ సమయంలో కనిపించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 బైకులో వైర్-స్పోక్ వీల్స్, లింకేజీతో కూడిన మోనో-షాక్ రియర్ సస్పెన్షన్, ముందు భాగంలో ట్విన్ డిస్క్ బ్రేకులు, స్ప్లిట్-సీట్ సెటప్ ఉన్నాయి. ఇందులోని 750సీసీ కెపాసిటీ గల ఇంజన్ గరిష్టంగా 50బిహెచ్‌పీ పవర్, 60ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సీఎఫ్ మోటో 450ఎమ్‌టీ

రాబోయే కొన్ని నెలల్లో సీఎఫ్ మోటో 450 ఎమ్‌టీ రాక భారతదేశంలో మోటార్ సైకిళ్ల మిడిల్ వెయిట్ అడ్వెంచర్ సెగ్మెంట్‌ను మరింత పవర్‌ఫుల్ చేస్తుంది. ఈ బైక్ 21 అంగుళాల ముందు, 18 అంగుళాల వెనుక చక్రాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ లాంచ్ తేదీ గురించి ఎటువంటి అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

కేటీఎమ్ 390 ఎస్‌ఎంసీఆర్

కేటీఎమ్ 390 ఎస్‌ఎంసీఆర్ భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. 500సీసీ సెగ్మెంట్లో కంపెనీ విడుదల చేస్తున్న తొలి సూపర్ మోటో బైక్ ఇదే కావడం విశేషం. ఈ బైక్‌లో వైర్-స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉన్నాయి. పవర్ట్రెయిన్‌గా ఈ బైక్ 399 సిసి లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేసి ఉంటుంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.