Adventure Bikes : యూత్‌కి నచ్చే క్రేజీ అడ్వెంచర్ బైకులు.. సరసమైన ధరలో వచ్చే ఈ ఐదింటిలో మీకు ఏది ఇష్టం?
Adventure Bikes : అడ్వెంచర్ బైకులు యూత్‌కి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. మీరు కూడా కొత్త అడ్వెంచర్ బైకు కొనే ఆలోచనలో ఉంటే.. ఐదింటి గురించి మాట్లాడుకుందాం..

భారతదేశం అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌ను కలిగి ఉంది. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో మైలేజ్ ఇచ్చే సరసమైన మోటార్‌సైకిళ్లూ ఉన్నాయి. దానితోపాటుగా లక్షల్లో ధర ఉండే క్లాస్ బైక్‌లు దొరుకుతాయి. మీరు రాబోయే రోజుల్లో అడ్వెంచర్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తే.. మీ కోసం కొన్ని బైకుల వివరాలు తీసుకొచ్చాం. 3 లక్షల కంటే తక్కువ ధరకే లభించే 5 బైక్‌ల లిస్టు చూద్దాం..
సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్
సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్ రూ. 2.16 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. సుజుకి వి-స్ట్రోమ్ ఎస్ఎక్స్.. 249 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో అమర్చబడి ఉంది. ఈ పవర్‌ట్రెయిన్ 25 బీహెచ్‌పీ పవర్, 22 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్‌బీ ఛార్జింగ్‌తో బ్లూటూత్ కనెక్టివిటీని అందిస్తుంది.
హీరో ఎక్స్‌పల్స్ 210
హీరో ఎక్స్‌పల్స్ 210 మోటార్‌సైకిల్‌ను రూ. 1,75,800 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. హీరో ఎక్స్‌పల్స్‌లోని 210 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 24.6 బీహెచ్‌పీ పవర్, 20.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని 4.2 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, మోనోషాక్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్‌తో అందిస్తుంది.
యెజ్డి అడ్వెంచర్
యెజ్డి అడ్వెంచర్‌ను రూ. 2.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 334 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. 29.1 బీహెచ్‌పీ పవర్, 29.8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడీ లైటింగ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌తో అందిస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ రూ. 2.85 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇది 452 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. 39.4 బిహెచ్‌పీ పవర్, 40 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్, పలు రైడింగ్ మోడ్‌లతో అందిస్తుంది.
కేటీఎం 250 అడ్వెంచర్
కేటీఎం 250 అడ్వెంచర్‌ను రూ. 2.59 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ మోటార్‌సైకిల్ 249 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో అందిస్తారు. ఇది 30.5 బీహెచ్‌పీ పవర్, 24 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని 5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ఆఫ్‌రోడ్ ఏబీఎస్, క్విక్‌షిఫ్టర్ ప్లస్‌తో అందిస్తుంది.
టాపిక్