ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో వచ్చే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు-5 best middle class budget smartphones with long battery life redmi 9 power realme 14x 5g realme p3x 5g realme narzo 80x ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో వచ్చే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలో వచ్చే 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు

Anand Sai HT Telugu

ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతే అదో పెద్ద చిరాకు. బ్యాటరీ లైఫ్ ఎక్కువగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ వచ్చే స్మార్ట్ ఫోన్లు చూద్దాం.. అమెజాన్‌లో రూ.15000 కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి.

బెస్ట్ బ్యాటరీ లైఫ్ స్మార్ట్ ఫోన్లు

స్మార్ట్‌ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీరు కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఉన్న ఫోన్ కొనాలనుకుంటే.. అమెజాన్‌లో మీకోసం ఉన్నాయి. తక్కువ ధరలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న కొన్ని స్మార్ట్‌ఫోన్స్ ఇవి. ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చి మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు సరిపోయే 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్ల గురించి చూద్దాం..

రెడ్‌మీ 9 పవర్

రూ.8,286 ధరకు ఈ ఫోన్ వినియోగ దారులకు అమెజాన్‌లో లభ్యం కానుంది. 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌ను అందించారు. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు.

రియల్‌మీ 14ఎక్స్ 5జీ

ఈ ఫోన్ 8 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను అమెజాన్‌లో రూ.14,690గా పెట్టారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉన్నాయి. కేవలం 7.94 మి.మీ సన్నగా ఉంటుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటే ధర తగ్గుతుంది.

రియల్‌మీ పీ3ఎక్స్ 5జీ

ఫోన్ 6 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను అమెజాన్‌లో రూ.12,638గా నిర్ణయించారు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, డైమెన్సిటీ 6400 చిప్‌సెట్ ఉన్నాయి. ఐపీ 69 రేటింగ్‌తో వస్తుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ధరను తగ్గించవచ్చు.

రియల్‌మీ నార్జో 80ఎక్స్ 5జీ

ఈ ఫోన్ 6 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను అమెజాన్లో రూ.12,998గా నిర్ణయించారు. దీనికి రూ .1250 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇది క్లెయిమ్ చేస్తే దాని ధర రూ .11,748 కు తగ్గుతుంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా ఉంది. డైమెన్సిటీ 6400 చిప్ సెట్‌ను అందించారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు.

ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ

ఈ ఫోన్ 4 ప్లస్ 128 జీబీ వేరియంట్ ధరను అమెజాన్లో రూ.11,999గా నిర్ణయించారు. రూ.1000 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇది క్లెయిమ్ చేస్తే దాని ధర రూ .10,999కు తగ్గుతుంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్‌సెట్‌ను అందించారు. కేవలం 7.99 మి.మీ సన్నగా ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ధరను మరింత తగ్గించవచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.