Credit card tips : బిగినర్స్​కి ఈ క్రెడిట్​ కార్డులు బెస్ట్​! వడ్డీ తక్కువ- బెనిఫిట్స్​ ఎక్కువ!-5 best low interest credit cards for beginners and people with poor credit score ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Credit Card Tips : బిగినర్స్​కి ఈ క్రెడిట్​ కార్డులు బెస్ట్​! వడ్డీ తక్కువ- బెనిఫిట్స్​ ఎక్కువ!

Credit card tips : బిగినర్స్​కి ఈ క్రెడిట్​ కార్డులు బెస్ట్​! వడ్డీ తక్కువ- బెనిఫిట్స్​ ఎక్కువ!

Sharath Chitturi HT Telugu
Nov 19, 2024 07:20 AM IST

Low interest credit cards : కొత్తగా ఒక క్రెడిట్​ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? లేక మీ క్రెడిట్​ స్కోర్​ని పెంచుకునేందుకు మంచి క్రెడిట్​ కార్డు కోసం అన్వేషిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ వడ్డీకి మంచి బెనిఫిట్స్​ని ఇస్తున్న క్రెడిట్​ కార్డుల వివరాలను ఇక్కడ చూసేయండి..

Latest low-interest credit cards.
Latest low-interest credit cards.

మీరు కొత్తగా క్రెడిట్​ కార్డు తీసుకోవాలని చూస్తున్నారా? లేదా తక్కువగా ఉన్న క్రెడిట్​ స్కోర్​ని పెంచుకునేందుకు లో- ఇంట్రెస్ట్​ క్రెడిట్​ కార్డు పొందాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే! తక్కువ వడ్డీని ఇస్తున్న పలు క్రెడిట్​ కార్డు వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎస్​బిఐ ఉన్నతి క్రెడిట్ కార్డ్

వార్షిక రుసుము: మొదటి నాలుగు సంవత్సరాలకు సున్నా.

రెన్యువల్​ ఫీజు: 5వ సంవత్సరం నుంచి రూ.499

వడ్డీ రేటు: నెలకు 2.50% లేదా సంవత్సరానికి 30%.

ఎస్బీఐ ఉన్నతి కీలక ఫీచర్స్​..

  1. క్రెడిట్ కార్డు కాంటాక్ట్​-లెస్​ ట్రాన్సాక్షన్స్​ ఇస్తుంది.
  2. ఈ క్రెడిట్ కార్డుపై జీవిత భాగస్వాములు, తోబుట్టువులు, పిల్లలు లేదా తల్లిదండ్రులకు యాడ్-ఆన్ సదుపాయం అందుబాటులో ఉంది.
  3. మీరు మీ మొత్తం ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు.
  4. రూ.2.5 లక్షలకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్​పై ఈ క్రెడిట్ కార్డు పొందొచ్చు.

యాక్సిస్ బ్యాంక్ ఇన్​స్టా ఈజీ క్రెడిట్ కార్డు

వార్షిక ఫీజు: జీరో

జాయినింగ్ ఫీజు: జీరో

వడ్డీ రేటు: నెలకు 2.50% లేదా సంవత్సరానికి 34.49%

యాక్సిస్ ఇన్​స్టా ఈజీ ఫీచర్స్​

  1. ఈ క్రెడిట్ కార్డు ద్వారా మీరు 100% క్రెడిట్ లిమిట్ వరకు నగదు ఉపసంహరించుకోవచ్చు.
  2. ఈ కార్డు ఫిక్స్​డ్​ డిపాజిట్​​లో 80% వరకు క్రెడిట్ పరిమితిని అందిస్తుంది.
  3. అన్ని ఇంధన ఖర్చులపై 1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు పొందండి.

ఎస్​బీఐ అడ్వాంటేజ్ ప్లస్ క్రెడిట్ కార్డు

వార్షిక ఫీజు: రూ.500

రెన్యువల్​ ఫీజు: రూ.500

వడ్డీ రేటు: నెలకు 2.25% లేదా సంవత్సరానికి 27%

ఎస్​బీఐ అడ్వాంటేజ్ ప్లస్ ఫీచర్స్​

  1. రూ.2,500 కంటే ఎక్కువ ఖర్చులను ఫ్లెక్సీ ఫీచర్​తో ఈఎంఐలుగా మార్చుకోండి.

2. అడ్వాంటేజ్ ప్లస్ క్రెడిట్ కార్డుదారులకు బ్యాలెన్స్ బదిలీ చేయడానికి ఈ కార్డు అనుమతిస్తుంది.

3. క్రెడిట్ లిమిట్ ఫిక్స్​ఢ్​ డిపాజిట్ మొత్తంలో 85% వరకు ఉంటుంది.

హెచ్​డీఎఫ్​సీ మనీ బ్యాక్ క్రెడిట్ కార్డు

వార్షిక ఫీజు: రూ.500

జాయినింగ్ ఫీజు: రూ.500

వడ్డీ రేటు: నెలకు 3.49%

హెచ్​డీఎఫ్​సీ మనీ బ్యాక్ ఫీచర్స్​..

  1. స్మార్ట్ ఈఎంఐ ఫీచర్ ద్వారా మీ ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకునే వెసులుబాటును ఈ కార్డు కల్పిస్తుంది.
  2. రూ.150 ఖర్చుకు 2 రివార్డ్ పాయింట్లు పొందొచ్చు.
  3. సకాలంలో చెల్లింపులు చేయకపోతే రూ.750 వరకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఐడీఎఫ్​సీ ఫస్ట్ డబ్ల్యూఓడబ్ల్యూ క్రెడిట్ కార్డు..

వార్షిక రుసుము: జీరో

జాయినింగ్ ఫీజు: సున్నా

వడ్డీ రేటు: నెలకు 0.75% నుంచి 3.65% లేదా సంవత్సరానికి 9% నుంచి 43.8% వరకు

ఐడీఎఫ్​సీ ఫస్ట్ డబ్ల్యూఓడబ్ల్యూ ఫీచర్స్​..

  1. ఐడీఎఫ్​సీ క్రెడిట్ కార్డుకు ఎలాంటి ఆదాయ రుజువు అవసరం లేదు.
  2. రివార్డ్ పాయింట్లకు ఎక్స్​పైరీ డేట్ లేదు.
  3. క్రెడిట్ హిస్టరీ పొందడానికి మీకు క్రెడిట్ హిస్టరీ అవసరం లేదు.

తక్కువ వడ్డీ రేటు ఉండే క్రెడిట్​ కార్డులు బిగినర్స్​కి చాలా మంచి చేస్తాయి. బడ్జెట్​ని చెక్​లో పెడతాయి. అంతేకకుండా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి క్రెడిట్​ని పునర్నిర్మించడానికి ఈ కార్డులు గొప్ప సాధనంగా పనిచేస్తాయి. మీరు ఈ కార్డును పొందిన తర్వాత, ఈ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలని నిర్ధరించుకోండి. మంచి క్రెడిట్ స్కోరును నిర్మించడానికి సకాలంలో చెల్లింపులు చేయండి. నిలకడతో మంచి క్రెడిట్ స్కోర్ సాధించవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం