భారత స్టాక్ మార్కెట్లోని మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ ఒకటి. ఈ స్టాక్ 5ఏళ్లల్లో 4000శాతానికిపైగా పెరిగింది. ఇక ఇప్పుడు, ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు గురవుతున్నప్పటికీ, హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ స్టాక్ సోమవారం ట్రేడింగ్ సెషన్లో 5శాతం వృద్ధిచెందింది. ఒక కీలక అప్డేట్ ఉండటం ఇందుకు కారణం.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో మల్టీబ్యాగర్ స్టాక్ అయిన హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్లు బీఎస్‌ఈలో 5.04% పెరిగి రూ. 619.75కు చేరుకున్నాయి. అక్కడి నుంచి కాస్త పడి, ఉదయం 11:30 సమయంలో రూ. 598 వద్ద ట్రేడ్ అవుతోంది.
రెండు ప్రాజెక్టుల కోసం దక్షిణ మధ్య రైల్వే నుంచి లెటర్స్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) అందుకున్నట్లు హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ వారాంతంలో ప్రకటించడంతో స్టాక్ పెరిగింది.
మొదటి ప్రాజెక్ట్ కింద విజయవాడ-బల్లార్‌షా సెక్షన్‌లోని 446 కిలోమీటర్ల ట్రాక్, 10 లోకోమోటివ్‌లు, 48 స్టేషన్లలో కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్‌కు దక్షిణ మధ్య రైల్వే ఎల్ఓఏ జారీ చేసింది. ఈ కాంట్రాక్టును 18 నెలల్లో పూర్తి చేయాలని హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ జూన్ 14న రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ కాంట్రాక్టు మొత్తం విలువ రూ. 132.95 కోట్లు (18% జీఎస్‌టీతో కలిపి) అని పేర్కొంది.
అదనంగా, ముద్ఖేడ్ సెక్షన్ పరిధిలోని 350 కి.మీ.ల ట్రాక్‌లో కవచ్ వెర్షన్ 3.2ను వెర్షన్ 4.0కు అప్‌గ్రేడ్ చేయడానికి (ముద్ఖేడ్తో కలిపి) కూడా దక్షిణ మధ్య రైల్వే కంపెనీకి ఎల్ఓఏ జారీ చేసింది. ఈ కాంట్రాక్టును 24 నెలల్లో పూర్తి చేయాలి, దీని మొత్తం విలువ రూ. 30.67 కోట్లు (18% జీఎస్‌టీతో కలిపి) అని కంపెనీ జూన్ 15న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ తన మొత్తం ఆర్డర్ బుక్ రూ. 4,029.05 కోట్లు అని తెలిపింది.
గత మూడు నెలల్లో హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్ షేర్ ధర 45% పెరిగింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు 5% తగ్గింది. సంవత్సర కాలంలో, ఈ స్టాక్ 26% లాభపడింది. ముఖ్యంగా, గత రెండేళ్లలో హెచ్‌బీబీఎల్ ఇంజినీరింగ్ షేర్ ధర 316% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. కాగా, గత ఐదేళ్లలో మాత్రం ఏకంగా 4,000% పెరిగింది.
కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 16,662 కోట్లకు పైగా ఉంది. డిజైనింగ్, మేన్యుఫ్యాక్చరింగ్, పవర్ సొల్యూషన్స్ సప్లైలో ఈ కంపెనీ పనిచేస్తుంది. దీనిని 1977లో స్థాపించరు.
సంబంధిత కథనం