ఆర్థికంగా జీవితాన్ని భద్రపరచడానికి ఇన్వెస్ట్‌మెంట్ ఎల్లప్పుడూ మంచిది. ఎఫ్‌డీలు ఎల్లప్పుడూ బెటర్ ఆప్షన్. ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే అందులో తక్కువ రిస్క్ ఉంటుంది. అంతేకాదు ఒక్కో బ్యాంకు మారుతున్న కొద్దీ వడ్డీ రేటు గణనీయంగా మారుతుంది. ఏ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేటును అందజేస్తుందో చూసుకోవాలి.
భారతదేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఎఫ్‌డీలను అందిస్తున్నాయి. అయితే ఏది బెటర్ అనే విషయంలో గందరగోళం కూడా ఉంటుంది. ఈ రెండు బ్యాంకులు 400 రోజుల ఎఫ్‌డీని కలిగి ఉన్నాయి.
మీరు సాధారణ ఇన్వెస్టర్ అయినా లేదా సీనియర్ సిటిజన్ అయినా.. మీకు అధిక రాబడిని ఇచ్చే పెట్టుబడి కోసం చూడాలి. మీరు ఎంచుకున్న పెట్టుబడుల పాలసీ ప్రమాద కారకాలు లేకుండా ఉండేలా చూసుకోండి. ఎస్పీఐ, పీఎన్‌బీలు 400 రోజుల ఎఫ్‌డీలను పోల్చినప్పుడు రెండు బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను చెక్ చేయాలి. ఈ బ్యాంకులకు ఏవైనా కనీస డిపాజిట్ అవసరాలు ఉన్నాయా? ముందస్తు ఉపసంహరణల కోసం ఏదైనా పెనాల్టీని వసూలు చేస్తున్నాయా? చూడాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 400 రోజుల ఎఫ్‌డీ కోసం వడ్డీ రేటు ఎస్బీఐ సాధారణ కస్టమర్లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటుకు హామీ ఇస్తుంది. ఈ వడ్డీ రేటు 1 సంవత్సరం, 2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి కోసం. కానీ ప్రస్తుతం బ్యాంక్ 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకాన్ని అందిస్తోంది. ఈ 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ (అమృత్ కలాష్) సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటు. సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ రేటు హామీ ఇస్తుంది. ఈ పథకం 31 మార్చి 2025 వరకు చెల్లుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 400 రోజుల ఎఫ్‌డీ కోసం వడ్డీ రేటు ప్రస్తుతం సాధారణ ప్రజలకు 7.30 శాతం వడ్డీ రేటుకు హామీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు కూడా 7.75 శాతం వడ్డీ రేటు ఇస్తోంది. సూపర్ సీనియర్ సిటిజన్లకు (80 ఏళ్లు అంతకంటే ఎక్కువ) 8.05 శాతం వడ్డీ రేటును కూడా బ్యాంక్ అందిస్తుంది.
ఎస్బీఐ, పీఎన్బీల ఎఫ్‌డీలకు కనీసం రూ.1,000 డిపాజిట్ అవసరం. రెండు బ్యాంకులు మధ్యలో ఉపసంహరణలకు పెనాల్టీని వసూలు చేస్తాయి. వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంది. రెండు బ్యాంకులలో ఎఫ్‌డీ ద్వారా రుణం తీసుకునే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీ నుండి పొందిన వడ్డీ రూ. 40,000 దాటితే టీడీఎస్ ఉంటుంది. సీనియర్ సిటిజన్లు ఆర్జించే వడ్డీ రూ. 50,000 దాటితే పన్ను విధిస్తారు.