Village Business Ideas : మీరు ఊర్లోనే ఉంటే తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేసేందుకు 40 ఐడియాలు
Village Business Ideas In Telugu : చాలా మందికి సొంత ఊర్లో ఉండాలనే కోరిక ఉంటుంది. అలాంటివారు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం బెస్ట్. అక్కడే బాగా సంపాదించొచ్చు. మీ కోసం 40 బిజినెస్ ఐడియాలు ఉన్నాయి.
అప్పుడప్పుడు కొన్ని వార్తలు వింటుంటాం. లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఊర్లో డైరీ ఫామ్ నడుపుతున్నారు అని. చాలా మందికి ఇలా సొంత ఊర్లో ఏదో ఒక పని చేసుకోవాలని ఉంటుంది. అలాంటివారు ధైర్యం చేసి ముందడుగు వేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు.
మీరు గ్రామీణ ప్రాంతంలో విజయవంతమైన చిన్న వ్యాపార ఆలోచనల కోసం చూస్తున్నట్లయితే ఈ సమాచారం కచ్చితంగా మీకు సహాయం చేస్తుంది. భారతదేశంలో ఇప్పటికీ అత్యధిక జనాభా గ్రామాలల్లో ఉన్నారు. పట్టణ ప్రాంతాలకు భిన్నంగా గ్రామాలకు వాటి స్వంత మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయంపై ఆధారపడే ఊర్లోలోనూ మీరు బిజినెస్ చేయవచ్చు. గ్రామంలో స్థిరపడిన వ్యక్తి అక్కడే వ్యాపారం ప్రారంభించడం లాభదాయకంగా ఉంటుంది. మీరు నివసిస్తున్న ప్రాంతంలో చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేయడానికి తక్కువ తక్కువ పెట్టుబడి అవసరం. ప్రతి ఒక్కరూ తెలిసిన వ్యక్తులే కాబట్టి అక్కడ వ్యాపారాన్ని నిర్వహించడం కూడా సులభం అవుతుంది. నోటి మాటల ద్వారా మీకు పబ్లిసిటీ కూడా వస్తుంది.
జనాభాలో 70 శాతం కంటే ఎక్కువ మంది గ్రామాలు, చిన్న పట్టణాలలో నివసిస్తున్నారు. మీరు చేసే వ్యాపారం అందరికి అవసరాన్ని తీర్చేలా ఉండాలి. అప్పుడు మీ బిజినెస్ బాగా జరుగుతుంది. గ్రామాలు కూడా ఇప్పుడు అప్డేట్ అయ్యాయి. దానికి తగ్గట్టుగా మీ వ్యాపారం ప్లాన్ చేసుకోవాలి. గ్రామాల్లో చేసేందుకు 40 ఉత్తమ వ్యాపార ఆలోచనలను చూద్దాం.
- సోలార్ పవర్ ప్రొడక్ట్స్
- మెుబైల్ రిపేర్ షాప్
- బాంబూ ప్రొడక్ట్స్
- హర్టికల్చర్ బిజినెస్
- ఆర్గానిక్ ఫార్మింగ్
- తేనె టీగల పెంపకం
- పుట్టుగొడుగుల ఫార్మింగ్
- హైడ్రోపోనిక్ ఫార్మింగ్(మట్టి లేకుండా నీరు, సూక్ష్మ పోషకాలతో ఆకుకూరలు, ఇతర పంటలు పెంచే పద్ధతి)
- పచ్చళ్ల తయారీ
- బెల్లం తయారీ
- స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్
- వర్మీ కంపోస్ట్ అమ్మకం
- డైరీ ఫార్మ్
- అగ్రో టూరిజం
- చేపల పెంపకం
- మెుక్కల పెంపకం
- ఆయుర్వేద మెుక్కల పెంపకం
- పిండి మిల్లు
- కోళ్ల పెంపకం
- వ్యవసాయ పనిముట్ల అమ్మకం
- అప్పాడాలు, స్నాక్స్ బిజినెస్
- వాటర్ సప్లై బిజినెస్
- జనరల్ స్టోర్
- హ్యండీక్రాఫ్ట్ బిజినెస్
- వ్యవసాయ సంబంధిత మెషినరీ అమ్మకాలు
- రవాణా సౌకర్యానికి వాహనాలు
- రైస్ మిల్లు
- కారం పొడి అమ్మకం
- కోళ్ల దాన అమ్మకాలు
- టైలరింగ్
- మేకల పెంపకం
- బెకరీ బిజినెస్
- నూనె ఉత్పత్తి
- ఇటుకల తయారీ
- జూట్ బ్యాగుల తయారీ
- పూల పెంపకం
- విత్తనాల ఉత్పత్తి
- ఆర్గానిక్ సబ్బుల తయారీ
- రూరల్ కోచింగ్ సెంటర్
టాపిక్