సాధారణ స్మార్ట్​ఫోన్స్​ బోర్​ కొట్టేశాయా? ఈ ఫ్లిప్​ ఫోన్స్​ ట్రై చేయండి- ధర కూడా తక్కువే..-4 most affordable flip phones to buy in india razr 50 infinix zero flip more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సాధారణ స్మార్ట్​ఫోన్స్​ బోర్​ కొట్టేశాయా? ఈ ఫ్లిప్​ ఫోన్స్​ ట్రై చేయండి- ధర కూడా తక్కువే..

సాధారణ స్మార్ట్​ఫోన్స్​ బోర్​ కొట్టేశాయా? ఈ ఫ్లిప్​ ఫోన్స్​ ట్రై చేయండి- ధర కూడా తక్కువే..

Sharath Chitturi HT Telugu

సరసమైన ధరకు ఫోల్డెబుల్​/ ఫ్లిప్​ స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఇండియాలో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న గ్యాడ్జెట్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

ఫ్లిప్​ ఫోన్​లు ట్రై చేస్తారా? వీటి ధరలు తక్కువ! (Aman Gupta/ Mint)

రెగ్యులర్​ స్మార్ట్​ఫోన్​లు వాడి, వాడి బోర్​ కొట్టేసిందా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీరు ఫ్లిప్-స్టైల్ ఫోన్స్​ని ట్రై చేయొచ్చు. కానీ వాటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే! భారతదేశంలో, శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 6, మోటోరోలా రేజర్​ 60 అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ఫోల్డెబుల్​ ఫోన్‌ల కంటే కొన్ని గ్యాడ్జెట్స్​ చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరసమైన ధరకు అందుబాటులో ఉన్న టాప్​ 4 ఫ్లిప్ ఫోన్‌ల జాబితాను ఇక్కడ తెలుసుకోండి..

భారతదేశంలో 4 సరసమైన ఫ్లిప్ ఫోన్‌లు:

1. మోటోరోలా రేజర్​ 50:

ఈ ఫ్లిప్​ ఫోన్​ గత సంవత్సరం వచ్చిన రేజర్​ 50 అల్ట్రా మోడల్‌కు సరసమైన ప్రత్యామ్నాయం! ఈ ఫోల్డెబుల్ స్మార్ట్​ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్​తో వస్తుంది. ఇది శక్తివంతమైన పనితీరును, రోజువారీ వినియోగాన్ని అందిస్తుంది. ఇందులో స్పష్టమైన విజువల్స్ కోసం 3.6-ఇంచ్​ ఔటర్​ డిస్‌ప్లే, 6.9-ఇంచ్​ పీఓఎల్​ఈడీ మెయిన్​ డిస్‌ప్లే ఉన్నాయి. ఈ ఫ్లిప్​ ఫోన్​ని మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 50,000 లోపు కొనుగోలు చేయవచ్చు.

2. ఇన్ఫీనిక్స్​ జీరో ఫ్లిప్​:

మీ వాచ్​లిస్ట్​లో ఉండాల్సిన మరో సరసమైన ఫ్లిప్ ఫోన్ ఈ ఇన్ఫీనిక్స్​ జీరో ఫ్లిప్​. ఇది గత సంవత్సరం లాంచ్​ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్​ డైమెన్సిటీ 8020 చిప్​సెట్​, 4720 ఎంఏహెచ్​ లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ వంటి కొన్ని ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తుంది. ఇందులోని 50ఎంపీ డ్యూయల్ రేర్​ కెమెరాలతో క్లియర్​ ఫొటోలను తీసుకోవచ్చు. ఇన్ఫీనిక్స్​ జీరో ఫ్లిప్​ ధర ఫ్లిప్​కార్ట్​లో రూ. 45వేల వరకు ఉంది.

3. టెక్నో ఫాంటమ్​ వీ ఫ్లిప్​ 2:

మీరు కొనుగోలు చేయగల మరో సరసమైన ఫ్లిప్​ స్మార్ట్‌ఫోన్ టెక్నోకి చెందిన లేటెస్ట్​ ఫాంటమ్​ వీ ఫ్లిప్​ 2. ఇది సొగసైన- ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోల్డెబుల్​ స్మార్ట్‌ఫోన్ ఏరోస్పేస్-గ్రేడ్ హింజ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 8తో మెరుగైన మన్నికను అందిస్తుంది. ఇది మీడియాటెక్​ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్‌తో సున్నితమైన పనితీరును కూడా అందిస్తుంది. ప్రస్తుతం, ఈ ఫోన్​ అమెజాన్​లో కేవలం రూ. 54,999కి కొనుగోలు చేయవచ్చు.

4. శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5:

చివరగా, మీరు ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మునుపటి తరం శాంసంగ్​ ఫోల్డెబుల్ ఫోన్ అయిన శాంసంగ్​ గెలాక్సీ జెడ్​ ఫ్లిప్​ 5 అమెజాన్‌లో దాదాపు రూ. 72,000కి లభిస్తుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఫర్ గెలాక్సీ ద్వారా పనిచేస్తుంది. ఇది ఫ్లాగ్‌షిప్ పనితీరును అందిస్తుంది. అదనంగా, ఇది ప్రీమియం బిల్డ్, శక్తివంతమైన కెమెరా సెటప్‌తో కూడా వస్తుంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం