Jio Recharge Plans : జియో 30జీబీ నుంచి 300జీబీ వరకు పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. ఓటీటీలు కూడా ఫ్రీ!
Jio Recharge Plans : జియో కస్టమర్లకు అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను(జియో ప్లస్) అందిస్తోంది. ఈ ప్లాన్లలో 30జీబీ నుంచి 300 జీబీ డేటా లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో ఓటీటీ యాప్స్‌కు కూడా ప్రీ యాక్సెస్ ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌ను ఎంచుకుంటారు. కొంతమంది వినియోగదారులు ప్రీపెయిడ్ ప్లాన్లను ఇష్టపడతారు, మరికొందరు పోస్ట్‌పెయిడ్ ఇష్టపడతారు. టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు అనేక పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల(జియో ప్లస్)ను అందిస్తోంది. వీటిలో 30జీబీ నుంచి 300జీబీ డేటా లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో ప్రీమియం ఓటీటీ యాప్స్‌కు ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

జియో పోర్ట్‌ఫోలియోలో మొత్తం 5 జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ ప్లాన్ల ధరలు రూ.349, రూ.449, రూ.649, రూ.749, రూ.1549గా ఉన్నాయి. ఈ ప్లాన్లలో ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో చూద్దాం.
రూ.349 ప్లాన్
చౌకైన జియో ప్లస్ ప్లాన్ అంటే రూ.349 ప్లాన్ గురించి తెలుసుకుందాం.. జియో ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇంటర్నెట్ ఉపయోగించడానికి 30జీబీ డేటాను అందిస్తుంది. ప్రతిరోజూ అపరిమిత కాలింగ్, 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. కంపెనీ జియో సినిమా యాక్సెస్ కూడా ఈ ప్లాన్‌లో ఇస్తున్నారు.
రూ.449 ప్లాన్
జియో రూ.449 ప్లాన్ విషయానికొస్తే ఇందులో మొత్తం 75జీబీ డేటా లభిస్తుంది. ఇదొక ఫ్యామిలీ ప్లాన్. ఈ ప్లాన్‌తో మీరు మూడు యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా తీసుకోవచ్చు. యాడ్ ఆన్ ఫ్యామిలీ సిమ్ నెలకు రూ.150 వసూలు చేస్తుంది. యాడ్-ఆన్ సిమ్‌కు ప్రతి నెలా అదనంగా 5జీబీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
రూ.649 ప్లాన్
అపరిమిత డేటా కోసం జియో రూ.649 ప్లాన్ ఉత్తమమైనది. అందులో యాడ్ ఆన్ సిమ్ ఆప్షన్ వస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్, జియో సినిమా ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది.
రూ.749 ప్లాన్
రూ.749 ప్లాన్ ఫ్యామిలీ ప్లాన్. ఇందులో కంపెనీ గరిష్టంగా మూడు ఫ్యామిలీ సిమ్ ఆప్షన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లో 100 జీబీ డేటా ఇంటర్నెట్ వినియోగానికి లభిస్తుంది. అదనపు సిమ్‌కు ప్రతి నెలా 5జీబీ అదనపు డేటాను కంపెనీ ఇస్తుంది. ఈ ప్లాన్లో 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. నెట్ ఫ్లిక్స్ (బేసిక్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ జియో సినిమా సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.
రూ.1549 ప్లాన్
రూ.1549 ప్లాన్ వ్యక్తిగత ప్లాన్. ఇందులో మొత్తం 300 జీబీ డేటాను ఇంటర్నెట్ వాడుకునేందుకు కంపెనీ అందిస్తోంది. ఇందులో మీకు 500 జీబీ వరకు డేటా రోల్ఓవర్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. మిగిలిన ప్లాన్ల మాదిరిగానే కంపెనీ ఈ ప్లాన్ ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్(మొబైల్), అమెజాన్ ప్రైమ్ లైట్, జియో సినిమాలకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.