Lowest interest rate personal loan : అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ కాావాలా? ఇలా చేయండి..
Personal loan tips : తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ పొందాలంటే ఏం చేయాలి? మంచి పర్సనల్ లోన్ డీల్ పొందడంలో మీకు సహాయపడే మూడు కీలక టిప్స్‌ని ఇక్కడ తెలుసుకోండి..
డబ్బు అవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియదు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల కోసం చాలా మంది ప్రయత్నించే ఆప్షన్స్‌లో పర్సనల్ లోన్ ఒకటి. కానీ సాధారణంగా పర్సనల్ లోన్‌పై వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. అయితే ఇప్పుడు, పర్సనల్ లోన్ దరఖాస్తుదారుడు ప్రయత్నించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సాధ్యమైనంత తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని పొందడం. వడ్డీ రేటులో స్వల్ప వ్యత్యాసం దీర్ఘకాలంలో భారీ ఆర్థిక భారాన్ని పెంచుతుంది. కాబట్టి, సాధ్యమైనంత తక్కువ రేటుకు పర్సనల్ లోన్ పొందడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే..
సాధ్యమైనంత తక్కువ రేటుకు పర్సనల్ లోన్ పొందడం ఎలా?
1. క్రెడిట్ స్కోర్‌ను మెరుగుపరుచుకోండి: పర్సనల్ లోన్ విషయంలో క్రెడిట్ స్కోర్ చాలా చాలా కీలకమైన విషయం. ఎంత ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉంటే అంత మంచిది. మీ క్రెడిట్ స్కోర్ అంతగా ఆకట్టుకోకపోతే, మీ స్కోరును మెరుగుపరుచుకోవడానికి మీరు చేతనైన ప్రయత్నం చేయడం మంచిది. ఒకవేళ క్రెడిట్ రిపోర్టులో తప్పులుంటే క్రెడిట్ రేటింగ్ బ్యూరోను సంప్రదించి సరిదిద్దుకోవాలి.
2. క్రెడిట్ కార్డుపై ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌కి బదులుగా మీరే దరఖాస్తు చేసుకోండి: తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని ఏర్పాటు చేయడానికి మరొక మార్గం మీ క్రెడిట్ కార్డుపై ప్రీ-అప్రూవ్డ్ లోన్ ఆఫర్‌ని స్వీకరించడానికి బదులుగా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవడం.
కొన్నిసార్లు, చాలా మంది రుణదాతలు ఈ ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను తమ పాత కస్టమర్లకు అందిస్తారు. ఈ రుణాలు - పొందడానికి చాలా సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ - అధిక వడ్డీ రేటుతో వస్తాయి. మరోవైపు, మీరు మీ బ్యాంకును సంప్రదించి దరఖాస్తు చేసినప్పుడు, వడ్డీ రేటు మీ లేటెస్ట్ క్రెడిట్ స్కోరు, మొత్తం దరఖాస్తు ఆధారంగా కాలిబరేట్ చేస్తారు. ఇది ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ కంటే తక్కువగా ఉండవచ్చు.
3. మీరు పని చేసే సంస్థ కూడా ముఖ్యమే : వడ్డీ రేటును ప్రభావితం చేసే మరో అంశం మీరు పని చేసే కంపెనీ పేరు ప్రఖ్యాతలు! మీరు గౌరవప్రదమైన కంపెనీలో పనిచేస్తే, మీరు మంచి పర్సనల్ లోన్ డీల్‌ని పొందే అవకాశాలు ఉన్నాయి.
మీరు స్వయం ఉపాధి లేదా చిన్న సంస్థలో పనిచేస్తుంటే, రుణదాతలు మీకు అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వడానికి మరింత జాగ్రత్తగా ఉంటారు.
(గమనిక: పర్సనల్ లోన్ రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని గుర్తించాలి.)
సంబంధిత కథనం