Electric Cars : బడ్జెట్ రెడీ చేసుకోండి.. మార్కెట్‌లోకి రానున్న 3 కొత్త ఎలక్ట్రిక్ కార్లు
New Electric Cars : ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే త్వరలో మూడు కొత్త మోడళ్లు మార్కెట్‌లో విడుదల కానున్నాయి. వాటిలో మీకు ఇది ఇష్టమో సెలక్ట్ చేసి తీసుకోండి. ఆ కార్లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారుల్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ విభాగంలో ఏకపక్ష ఆధిపత్యాన్ని టాటా మోటార్స్ కొనసాగిస్తోంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ వాటా 70 శాతంగా ఉంది.
ఇప్పుడు ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి మారుతి సుజుకి, హ్యుందాయ్ ఇండియా, కియా వంటి కంపెనీలు కూడా ట్రై చేస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చాయి. మరికొన్ని కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత మార్కెట్లో లాంచ్ కానున్న ఇలాంటి 3 ఎలక్ట్రిక్ కార్ల ఫీచర్లు, రేంజ్, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
హ్యుందాయ్ క్రెటా ఈవీ
హ్యుందాయ్ క్రెటా.. కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన కారుగా ఉంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. దీనిని భారతీయ రోడ్లపై అనేకసార్లు పరీక్షించారు. హ్యుందాయ్ క్రెటా ఈవీ 2025 ప్రారంభంలో భారత మార్కెట్లో లాంచ్ కావచ్చని అనేక మీడియా నివేదికలు చెబుతున్నాయి. హ్యుందాయ్ క్రెటా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
మారుతి సుజుకి ఈవీఎక్స్
భారతదేశంలో అతిపెద్ద కార్ల విక్రయదారు మారుతి సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఈవీఎక్స్, ఇది అనేకసార్లు భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేశారు. మారుతి సుజుకి ఈవీఎక్స్ తన కస్టమర్లకు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని పలు మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
కియా ఈవీ9
గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారులలో బాగా ప్రాచుర్యం పొందుతున్న కియా ఈవీ9 తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈవీ9ను అక్టోబర్ 3న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. రాబోయే కియా ఈవీ9 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా పరిధిని తన వినియోగదారులకు అందిస్తుందని పలు మీడియా నివేదికలు చెప్పాయి. కియా ఈవీ9ను పూర్తిగా సీబీయూ(Completely Built Up) మార్గం ద్వారా భారత మార్కెట్లోకి తీసుకురానుంది.