Best Camera Phones : రూ.12 వేలలోపు ధరలో మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్స్.. ఈ 3 డీల్స్ చూసేయండి!
Best Camera Phones : మంచి కెమెరా స్మార్ట్‌ఫోన్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే దీనికి తగ్గట్టుగా బడ్జెట్ కూడా ఉండాలి. అందుకే మీ కోసం బడ్జెట్ ధరలో వచ్చే 3 స్మార్ట్ ఫోన్స్ తీసుకొచ్చాం. వీటి గురించి తెలుసుకోండి.

కెమెరా బాగుంటుదని స్మార్ట్ ఫోన్ కొనేవారు కూడా చాలా మందే ఉన్నారు. మీ బడ్జెట్ కూడా రూ.12 వేలలోపుఅయితే మీ కోసం మంచి కెమెరా ఫోన్స్ ఉన్నాయి. ఈ 3 స్మార్ట్‌ఫోన్లలో మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. ఈ జాబితాలో రెడ్‌మీ, పోకో ఫోన్లు ఉన్నాయి. ఈ బెస్ట్ కెమెరా ఫోన్లలో 108 మెగాపిక్సెల్ వరకు కెమెరా, 120 హెర్ట్జ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. రూ.11,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే.
రెడ్‌మీ 13 5జీ
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 చిప్ సెట్‌తో రెడ్‌మీ 13 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.11,849 ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ తర్వాత రూ.10,849కే ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 16 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్‌తో ఈ ఫోన్ వస్తుంది. 33వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5030ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.
టెక్నో పోవా 6 నియో 5జీ
భారీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఉన్న ఈ ఫోన్ అమెజాన్‌లో రూ.11,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై రూ.1000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఏఐ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే ఇందులో 3ఎక్స్ ఇన్ సెన్సార్ జూమ్ సపోర్ట్ ఉంటుంది. షూటింగ్ మోడ్, సూపర్ నైట్ మోడ్, టైమ్ లాప్స్, డ్యూయల్ వీడియో వంటి పలు మోడ్స్ ఈ ఫోన్లో ఉండనున్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
పోకో ఎం6 ప్లస్ 5జీ
108 మెగాపిక్సెల్ కెమెరాతో పోకో ఎం6 ప్లస్ 5జీ వచ్చింది. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.10,999కు అమ్ముడవుతోంది. క్రెడిట్ కార్డుతో ఫోన్ కొంటే రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. పోకో ఎం6 ప్లస్ 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన సెన్సార్ 108 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. మెయిన్ సెన్సార్ 3ఎక్స్ ఇన్ సెన్సార్ జూమ్ ను అందిస్తుంది. ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్లో 5,030 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 16 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ కెపాసిటీతో వస్తుంది. పోకో ఎం6 ప్లస్ 5జీలో 6.79 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.
గమనిక : స్మార్ట్ ఫోన్ల మీద బ్యాంక్ డిస్కౌంట్, ఇతర ఆఫర్లు మారుతూ ఉండవచ్చు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.