Best Bike in India : యువతకు పిచ్చెక్కించే​ స్టైలిష్​ బైక్​ ఇది- ఇప్పుడు కొత్త ఫీచర్స్​తో..-2025 tvs ronin unveiled at motosoul will launch in january ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Bike In India : యువతకు పిచ్చెక్కించే​ స్టైలిష్​ బైక్​ ఇది- ఇప్పుడు కొత్త ఫీచర్స్​తో..

Best Bike in India : యువతకు పిచ్చెక్కించే​ స్టైలిష్​ బైక్​ ఇది- ఇప్పుడు కొత్త ఫీచర్స్​తో..

Sharath Chitturi HT Telugu
Dec 08, 2024 07:07 AM IST

TVS Ronin 2025 : టీవీఎస్​ రోనిన్​ బైక్​ 2025 వర్షెన్​ లాంచ్​కి రెడీ అవుతోంది. ఈ మోడల్​ని తాజాగా సంస్థ ఆవిష్కరించింది. ఇందులో కనిపించే మార్పులతో పాటు ఇతర వివరాలను ఇక్కడ చూసేయండి..

2025 టీవీఎస్​ రోనిన్​..
2025 టీవీఎస్​ రోనిన్​..

గోవా వాగటోర్​లో ఇండియా బైక్ వీక్​తో పాటు జరిగిన మోటోసోల్ ఈవెంట్​లో టీవీఎస్ మోటార్ కంపెనీ 2025 రోనిన్​ని ఆవిష్కరించింది. అప్​డేటెడ్ మోటార్ సైకిల్ కొత్త కలర్ వేస్, డ్యూయెల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ రూపంలో కాస్మెటిక్ మార్పులను పొందుతుంది. టీవీఎస్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త రోనిన్​ని విడుదల చేయనుంది.

yearly horoscope entry point

2025 టీవీఎస్ రోనిన్ కొత్త కలర్ ఆప్షన్లు ఏంటి?

2025 టీవీఎస్ రోనిన్ ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది. అవి.. గ్లేసియర్ సిల్వర్, చార్కోల్ ఎంబర్. ఈ రంగులు మునుపటి డెల్టా బ్లూ, స్టార్​గేజ్ బ్లాక్​లను రిప్లేస్​ చేస్తాయి.

డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఫీచర్​..

టీవీఎస్ ఇప్పుడు బేస్ వేరియంట్లలో మాత్రమే సింగిల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్​ని అందిస్తుంది. ఈ బైక్​ మిడ్ వేరియంట్ నుంచి, మోటార్ సైకిల్ డ్యూయెల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్​తో వస్తుంది.

2025 టీవీఎస్ రోనిన్- ఇంజిన్​..

2025 టీవీఎస్ రోనిన్ బైక్​ హార్డ్​వేర్​లో ఎలాంటి మెకానికల్ మార్పులు లేవు. ఇది 225 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్​తో వస్తుంది. 7,750 ఆర్​పీఎం వద్ద 20 బీహెచ్​పీ పవర్​, 3,750 ఆర్​పీఎం వద్ద 19.93 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్​తో 5-స్పీడ్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది.

2025 టీవీఎస్ రోనిన్ ఫీచర్లు ఏమిటి?

టీవీఎస్ రోనిన్ బైక్​ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేసే డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​తో వస్తుంది. ఏబీఎస్ మోడ్​లు, గ్లైడ్ త్రూ ట్రాఫిక్ కూడా ఉన్నాయి. ఇంజిన్ తక్కువ వేగంతో ఆగిపోకుండా ఉండేలా చూసుకుంటాయి. ఆల్​ ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ కటాఫ్ సెన్సార్, సైలెంట్ స్టార్టర్ కూడా ఉన్నాయి.

టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రీమియం హెడ్ బిజినెస్ - ప్రీమియం శ్రీ విమల్ సుంబ్లీ మాట్లాడుతూ.. “టీవీఎస్ మోటోసోల్ 2024.. 'ఫీల్ ది అడ్రినలైన్, ఫీల్ ది ఇన్స్​పిరేషన్, ఫీల్ ది గ్రూవ్' అనే థీమ్​తో అభిరుచి, సృజనాత్మకత, కమ్యూనిటీ నిజమైన వేడుక. ప్రతి ఎడిషన్​తో రైడర్లు, ఔత్సాహికులకు ఉత్తేజకరమైన అనుభవాలను అందిస్తూ మోటారు సైక్లింగ్ స్ఫూర్తిని పెంచాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మోటారు సైక్లింగ్ కమ్యూనిటీ వృద్ధి చెందడాన్ని చూడటం స్ఫూర్తిదాయకం. మనిషి- యంత్రం మధ్య బంధాన్ని బలోపేతం చేసే ప్రత్యేకమైన అనుభవాలను సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని అన్నాారు.

ఈ మోడల్​ ధరతో పాటు ఇతర వివరాలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటిని మేము మీకు అప్డేట్​ చేస్తాము.

Whats_app_banner

సంబంధిత కథనం