2025 Toyota Camry : సరికొత్తగా ప్రీమియం సెడాన్ టయోటా కామ్రీ- లాంచ్ ఎప్పుడంటే..
2025 టయోటా కామ్రీ ఇండియాలో లాంచ్‌కి రెడీ అవుతోంది. ఈ మోడల్ లాంచ్ డేట్‌తో పాటు ఇతర కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో టయోటా కామ్రీ లేటెస్ట్ వర్షెన్ లాంచ్‌కి రెడీ అవుతోంది. డీ- సెగ్మెంట్ సెడాన్ విభాగంలో కామ్రీ డిసెంబర్ 11న ఇండియాలో అడుగుపెట్టనుంది. విడుదల తర్వాత, కొత్త తరం టయోటా కామ్రీ సెడాన్ తాజా స్కోడా సూపర్బ్, బీవైడీ సీల్ ఈవీ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది.
తొమ్మిదో తరం కామ్రీని భారత్ లో స్థానికంగా ఉత్పత్తి చేయనున్నారు. 11ఏళ్ల క్రితం ఈ మోడల్ తొలిసారి ఇండియాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా నిలిచింది.
రాబోయే టయోటా కామ్రీ భారతదేశంలో అందుబాటులో ఉన్న ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే పూర్తిగా రీడిజైన్ పొందుతోందని చెప్పాలి. ఇది విశాలమైన ఫ్రంట్ గ్రిల్, యాంగ్యులర్ హెడ్ ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇది దాని మునుపటి మోడల్ కంటే భిన్నంగా ఉంటుంది! వెనుక డిజైన్ లెక్సస్ నుంచి ప్రేరణ పొందుతుంది. హెడ్ ల్యాంప్‌లు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లను కలిగి ఉన్నాయి. రేడియేటర్ గ్రిల్ ఆకర్షణీయమైన రూపాన్ని పొందుతుంది.
2025 టయోటా కామ్రీ- ఫీచర్లు..
ఎక్స్టీరియర్ స్టైలింగ్‌తో పాటు ఇంటీరియర్‌లోనూ గణనీయమైన మార్పులు కనిపించొచ్చు. సెడాన్‌లోని కొత్త క్యాబిన్ డ్యూయల్-డిజిటల్ డిస్ప్లేతో వస్తుంది. అయినప్పటికీ సెంటర్ కన్సోల్‌ని కొద్దిగా మాత్రమే మార్చారు. వెనుక సీటు బ్యాక్ స్క్రీన్లు, టైప్-సీ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్, విండో కర్టెన్లుస జేబీఎల్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ సెడాన్‌లో ఉన్నాయి. అదనంగా, వెనుక ప్రయాణీకులకు వ్యక్తిగత క్లైమేట్ జోన్లు లభిస్తాయి. కారు భారీ వీల్ బేస్ తగినంత లెగ్ రూమ్‌ని తెస్తుంది.
2025 టయోటా కామ్రీ: ఇంజిన్- స్పెసిఫికేషన్లు..
కొత్త తరం టయోటా కామ్రీ సెడాన్ 2.5-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ ను కలిగి ఉంది. ఇది గరిష్టంగా 222 బీహెచ్పీ పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. టయోటా కామ్రీ సెడాన్ అంతర్జాతీయ వేరియంట్ ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ని కలిగి ఉన్నప్పటికీ, ఇది భారత మార్కెట్లో లభించే అవకాశం లేదు.
భారతదేశంలో విక్రయించే ప్రస్తుత టయోటా కామ్రీ 2.5 లీటర్ నాలుగు సిలిండర్ల పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ని కలిగి ఉంది. ఇది 175.6 బీహెచ్పీ పవర్, 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రాబోయే జనరేషన్లో ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం