‘వెల్​ కమ్​ టు ఇండియా’- భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్​ కారు టెస్ట్​ డ్రైవ్​..-2025 tesla model y electric car spotted on indian roads see full details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ‘వెల్​ కమ్​ టు ఇండియా’- భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్​ కారు టెస్ట్​ డ్రైవ్​..

‘వెల్​ కమ్​ టు ఇండియా’- భారత రోడ్లపై టెస్లా ఎలక్ట్రిక్​ కారు టెస్ట్​ డ్రైవ్​..

Sharath Chitturi HT Telugu

ఇండియాలో టెస్లా ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్​ అప్డేట్​! టెస్లాకు చెందిన ఒక ఎలక్ట్రిక్​ వెహికిల్​ భారత రోడ్లపై టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ కనిపించింది! ఇది టెస్లా మోడల్​ వై. పూర్తి వివరాల్లోకి వెళితే..

టెస్లా మోడల్​ వై.. (Twitter/ashishpol86)

ఇండియాలో టెస్లా ఎంట్రీపై బిగ్​ అప్డేట్​! గత నెలలో రిక్రూట్​మెంట్​ ప్రాసెస్​ని ప్రారంభించిన ఈ దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ.. ఇప్పుడు భారత రోడ్లపై తన పోర్ట్​ఫోలియోలోని ఒక ఈవీని పరీక్షిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్​గా మారింది. వీడియోలో కనిపిస్తున్నది 2025 టెస్లా మోడల్​ వై. ముంబై- పుణె ఎక్స్​ప్రెస్​ వేపై ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ టెస్ట్​ డ్రైవ్​ చేస్తూ​ కనిపించింది.

ఎలాన్​ మస్క్​కి చెందిన టెస్లా తన మొదటి డీలర్​షిప్​ షోరూమ్​ని ముంబైలో ప్రారంభిస్తుందని, తొలుత భారతదేశంలో పూర్తిగా దిగుమతి అయ్యే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మొదలుపెడుతుందని కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. ఈ బ్రాండ్ మొదట మోడల్ వైని భారత మార్కెట్​లో విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇదొక ఎస్​యూవీ కావడం, ఈ బాడీ స్టైల్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందడంతో ఇండియాలోకి కూడా ఇదే వస్తుందని అంచనాలు పెరిగాయి. ఇండియా రోడ్లపై నడిచే వాహనాలకు కాస్త ఎక్కువ గ్రౌండ్​ క్లియరెన్స్​ కావాలి. మోడల్​ వై ఇందుకు కరెక్ట్​గా సూట్​ అవుతుంది. గతంలో టెస్లా పరీక్షించిన మోడల్​ 3 గ్రౌండ్​ క్లియరెన్స్​ విషయంలో చాలా సమస్యలను ఎదుర్కొంది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియోను ఇక్కడ చూడండి :

గ్లోబల్ మార్కెట్​లో మోడల్ వై సింగిల్ కాన్ఫిగరేషన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్​తో ఆల్-వీల్ డ్రైవ్ పవర్ట్రెయిన్​ని పొందుతుంది. దీని రేంజ్​ 526 కిలోమీటర్లు. టాప్​ స్పీడ్​ గంటకు 200 కిలోమీటర్లు. ఇది 0-96 కేఎంపీహెచ్​ స్పీడ్​ని కేవలం 4.6 సెకన్లలో అందుకుంటుంది.

అయితే అంతర్జాతీయ మార్కెట్​లో ఉన్నదానితో పోల్చుకుంటే మరింత అఫార్డిబుల్​ మోడల్​ వైని ఇండియా కోసం టెస్లా రెడీ చేస్తోందని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీనిని టెస్లా ఇంకా ధ్రువీకరించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

కాగా మోడల్​ వై, మోడల్​ 3 కోసం ఇండియాలో హోమోలగేషన్​ని ఫైల్​ చేసింది టెస్లా. ఇదొక సర్టిఫికేషన్​ ప్రాసెస్​. సదరు వాహనం మన రోడ్లపై నడిచెందుకు టెక్నికల్​గా, లీగల్​గా ఫిట్​ అవుతుందా? లేదా? అనేది ఈ సర్టిఫికేట్​ సూచిస్తుంది.

ఛార్జింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై టెస్లా ఫోకస్​..

ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఛార్జింగ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై కూడా టెస్లా ఫోకస్​ చేసింది. ఇందులో భాగంగా కంపెనీ ఛార్జింగ్​ ప్రోగ్రామ్స్​ని నడిపేందుకు కొత్త ఉద్యోగాలను ప్లాన్​ చేస్తోంది. అంతేకాదు ఈవీలను విక్రయించి, కస్టమర్స్​కి మంచి ఎక్స్​పీరియెన్స్​ని కలిగించే విధంగా మార్కెటింగ్​, హైరింగ్​ స్పెషలిస్ట్​లను కూడా తీసుకుంటోంది.

టెస్లా ఛార్జింగ్​ ప్రోగ్రామ్​లో చేరిన వారు.. ఇండియాలో ఎలక్ట్రిక్​ కార్ల ఛార్జింగ్​కి కొత్త లోకెషన్​ని వెతకడం, ప్రాపర్టీ ఓనర్స్​- ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఛార్జింగ్​ స్టేషన్స్​ని సరైన టైమ్​కి ఏర్పాటు చేయడం వంటి వాటికి బాధ్యత వహిస్తారు. ఇందుకోసం 'ఎక్సలెంట్​ ఛార్జింగ్​ డెవలపర్​' కోసం చూస్తున్నట్టు టెస్లా తన కొత్త హైరింగ్​ పోస్ట్​లో పేర్కొంది.

ఇండియాలో ఎంట్రీపై టెస్లా ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం