2025 Tata Tigor : ఈ బడ్జెట్​ సెడాన్​లో కొత్త టాప్​ ఎండ్​ వేరియంట్​ లాంచ్​! ధర కూడా తక్కువే..-2025 tata tigor gets a new top end variant heres what the new variant has to offer ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2025 Tata Tigor : ఈ బడ్జెట్​ సెడాన్​లో కొత్త టాప్​ ఎండ్​ వేరియంట్​ లాంచ్​! ధర కూడా తక్కువే..

2025 Tata Tigor : ఈ బడ్జెట్​ సెడాన్​లో కొత్త టాప్​ ఎండ్​ వేరియంట్​ లాంచ్​! ధర కూడా తక్కువే..

Sharath Chitturi HT Telugu
Published Feb 11, 2025 06:01 AM IST

2025 Tata Tigor : 2025 టిగోర్​లో కొత్త టాప్​ ఎండ్​ వేరియంట్​ని సంస్థ లాంచ్​ చేసింది. ఈ మోడల్​ ఫీచర్స్​, ధర, స్పెసిఫికేషన్స్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 టాటా టిగోర్​..
2025 టాటా టిగోర్​..

సబ్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్​లో ఇటీవల అనేక కొత్త కార్లు లాంచ్ అవ్వడంతో మళ్లీ ఉత్సాహం పెరిగింది. 2024 మారుతీ సుజుకీ డిజైర్ (నవంబర్ 2024లో లాంచ్) తో ప్రారంభమై, 2024 హోండా అమేజ్ (డిసెంబర్ 2024లో లాంచ్) కూడా వచ్చింది. అదే సమయంలో టాటా టిగోర్ కూడా జనవరి 2025లో అప్‌డేట్ అయ్యింది. ఆసక్తికరంగా, డిజైర్- అమేజ్ పూర్తిగా కొత్త తరం మోడళ్లు అయితే, టిగోర్ ఫీచర్స్ లిస్ట్, వేరియంట్లలో అప్‌డేట్స్‌తో ఫేస్‌లిఫ్ట్ పొందింది. కాగా ఇప్పుడు 2025 టిగోర్​లో కొత్త టాప్​ ఎండ్​ మోడల్​ని సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు టిగోర్​ ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్​. ఈ వేరియంట్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 టాటా టిగోర్ ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్ - ఫీచర్లు..

2025 టాటా టిగోర్ టాప్ వేరియంట్ 15-ఇంచ్​ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ఇది పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే సీఎన్జీ వర్షెన్ 14 ఇంచ్​ రిమ్స్‌ను పొందుతుంది. అదనంగా, ఇది ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్-సెన్సింగ్ వైపర్స్, ఆటోఫోల్డ్ ఓఆర్​వీఎంలు, షార్క్ ఫిన్ ఆంటీనాను కూడా పొందుతుంది. ప్రీమియం టచ్ కోసం ఇది క్రోమ్-లైన్డ్ డోర్ హ్యాండిల్స్‌ను కూడా కలిగి ఉంటుంది.

10.25-ఇంచ్​ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను వైర్‌లెస్ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీతో ఈ టాటా టిగోర్​ టాప్​ ఎండ్​ వేరియంట్​ కేబిన్​ వస్తుంది. ఇది మెరుగైన ఆడియో అనుభవం కోసం నాలుగు ట్వీటర్లను కలిగి ఉంది. పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్​ కంట్రోల్​, కూల్డ్​ గ్లోవ్ బాక్స్, లెదర్-ర‍్యాప్డ్ స్టీరింగ్ వీల్, ఫ్రంట్ టైప్-సీ చార్జింగ్ పోర్ట్, వానిటీ మిర్రర్, మ్యాగజైన్ పాకెట్స్ ఉన్నాయి.

సేఫ్టీ విషయానికొస్తే, ఈ వేరియంట్ 360-డిగ్రీ కెమెరా సిస్టెమ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్​లను ఈ మోడల్​ పొందుతుంది. వీటితో పాటు, ఇది ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్​ లను కూడా పొందుతుంది.

2025 టాటా టిగోర్ ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్ - స్పెసిఫికేషన్స్​..

ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్ వేరియంట్ పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్​లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎక్స్​జెడ్​ ప్లస్​ లక్స్ పెట్రోల్ ఆప్షన్ ధర రూ.8.50 లక్షలు, అయితే సీఎన్జీ ఆప్షన్ ధర రూ.9.50 లక్షలు. రెండూ ధరలు ఎక్స్-షోరూమ్.

టాటా టిగోర్ 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌పై పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కనెక్ట్​ చేసి ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లలో, ఈ ఇంజిన్ 85బీహెచ్​పీ పవర్​, 113ఎన్​ఎం టార్క్‌ను జనరేట్​ చేస్తుంది, టిగోర్ సీఎన్జీ వేరియంట్లు​ 72బీహెచ్​పీ పవర్​, 95ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం