Best budget car : ఈ కారు ధర రూ.9లక్షల లోపే! లేటెస్ట్​ అప్డేట్స్​తో మిడిల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​ ఛాయిస్​..-2025 tata tiago nrg launched with new features gets cng amt option ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Best Budget Car : ఈ కారు ధర రూ.9లక్షల లోపే! లేటెస్ట్​ అప్డేట్స్​తో మిడిల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​ ఛాయిస్​..

Best budget car : ఈ కారు ధర రూ.9లక్షల లోపే! లేటెస్ట్​ అప్డేట్స్​తో మిడిల్​ క్లాస్​కి పర్ఫెక్ట్​ ఛాయిస్​..

Sharath Chitturi HT Telugu
Published Mar 14, 2025 11:18 AM IST

22025 Tata Tiago NRG : 2025 టియాగో ఎన్​ఆర్​జీ వచ్చేసింది. ఇందులో అనేక కొత్త ఫీచర్స్​, సీఎన్జీ ఏఎంటీ ఆప్షన్​ కూడా వస్తోంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

టాటా టియాగో ఎన్​ఆర్​జీ..
టాటా టియాగో ఎన్​ఆర్​జీ..

2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ తాజాగా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్​ వర్షెన్​లో కొత్త ఫీచర్లు, స్టైలింగ్ అప్డేట్స్​, కొత్త ట్రాన్స్​మిషన్ ఆప్షన్​ని టాటా మోటార్స్​ ప్రవేశపెట్టింది. 2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ ధర ఇప్పుడు రూ .7.2 లక్షల నుంచి రూ .8.75 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. టాప్-స్పెక్ ఎక్స్​జెడ్​ వేరియంట్​లో మాత్రమే లభిస్తుంది. ఎంట్రీ లెవల్ ఎక్స్​టీ వేరియంట్​ని సంస్థ నిలిపివేసింది. 2025 టియాగో మాదిరిగానే, కొత్త టియాగో ఎన్ఆర్​జీ పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్​ పొందుతుంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ: కొత్తదేంటి?

2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ మైక్రో స్టైలింగ్ అప్డేట్స్​తో వస్తుంది. ఇందులో కొత్త మ్యాట్ బ్లాక్ క్లాడింగ్​తో రీడిజైన్ చేసిన బంపర్, ఫ్రెంట్​- రేర్​ భాగంలో మందపాటి సిల్వర్ స్కిడ్​ప్లేట్ ఉన్నాయి. 15 ఇంచ్​ స్టీల్ వీల్స్​కు వేర్వేరు కవర్లు వస్తున్నాయి. టియాగో ఎన్ఆర్​జీ సైడ్స్​లో బ్లాక్​ క్లాడింగ్ వస్తుంది. పైకప్పు నలుపు రంగులో ఉంటుంది.

2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ: ఇంటీరియర్ అప్డేట్స్..

వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్​ప్లేతో కూడిన పెద్ద 10.25-ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్ యూనిట్​ సహా క్యాబిన్ మరింత గుర్తించదగిన మార్పులను పొందుతుంది. ఈ సెగ్మెంట్​లోనే ఇదే అతిపెద్ద యూనిట్. రివర్స్ కెమెరా, ఆటో హెడ్​ల్యాంప్, వైపర్స్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రామాణిక టియాగోతో పోలిస్తే, టియాగో ఎన్ఆర్​జీలో సీట్లు, డోర్ ప్యాడ్లు, డ్యాష్​బోర్డ్​ సహా ఆల్-బ్లాక్ క్యాబిన్ ఉంది. 2025 టాటా టియాగో ఎన్ఆర్​జీ కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్.. ప్రకాశవంతమైన టాటా లోగో కలిగి ఉంది.

స్పెసిఫికేషన్లు..

టాటా టియాగో ఎన్ఆర్​జీ 84.8 బీహెచ్​పీ కోసం ట్యూన్ చేసిన 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్య ఇది 5-స్పీడ్ మాన్యువల్. ఏఎంటీ యూనిట్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. సీఎన్జీ వర్షెన్ 71బీహెచ్​పీ పవర్​ని ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, ఏఎంటీ యూనిట్​తో ఇది కనెక్ట్​ చేసి ఉంటుంది. సీఎన్జీ-ఏఎంటీ మోడల్​ సరికొత్త ఆప్షన్​. గత సంవత్సరం టియాగో సిఎన్జిలో కూడా వచ్చిది.

ఈ అప్డేటెడ్​ టాటా టియాగో ఎన్ఆర్​జీ మారుతీ సుజుకీ స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్​ సహా అనేక ఆఫర్లతో పోటీపడుతుంది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం