2025 Tata Tiago EV: రూ.8 లక్షల ధరతో, సరికొత్త ఫీచర్స్ తో 2025 టాటా టియాగో ఈవీ లాంచ్
2025 Tata Tiago EV: 2025 టాటా టియాగో ఈవీ ని టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇందులో కొత్త ఫీచర్లతో పాటు పలు కాస్మోటిక్ అప్ గ్రేడ్ లను చేశారు. ఈ 2025 టాటా టియాగో ఈవీ ఎక్స్ షో రూమ్ ధర రూ. 6 లక్షలుగా నిర్ణయించారు.
2025 Tata Tiago EV: 2025 టాటా టియాగో ఈవీని భారత మార్కెట్లో విడుదల చేశారు. దీనిని 2025 భారత్ మొబిలిటీ ఎక్స్ పో లో ప్రదర్శించాలని భావిస్తున్నారు. టాటా టియాగో ఈవీ 2025 లో పలు కొత్త ఫీచర్లను టాటా మోటార్స్ జోడించింది. స్వల్ప కాస్మెటిక్ మార్పులను కూడా చేసింది. ప్లాట్ ఫామ్, బేస్ లలో ఎటువంటి మార్పులు లేవు.
రీడిజైన్డ్ గ్రిల్
2025 టాటా టియాగో ఈవీ లో ఎల్ ఇడి హెడ్ ల్యాంప్ ల సెట్ తో పాటు కొత్తగా రీడిజైన్ చేసిన గ్రిల్ ఉంటుంది. ఫ్రంట్ డోర్లకు కొత్త 'ఈవీ' బ్యాడ్జింగ్ ను తీసుకువచ్చారు. అదనంగా, ఇందులో రీడిజైన్ చేసిన 14 అంగుళాల వీల్స్ కూడా ఉన్నాయి. అలాగే, ప్రస్తుతం ఉన్న కలర్స్ కు తోడు సూపర్ నోవా కాపర్, చిల్లీ లైమ్, అరిజోనా బ్లూ అనే మూడు కొత్త రంగుల్లో 2025 మోడల్ టియాగో ఈవీ లభిస్తుంది. డేటోనా గ్రే, సిగ్నేచర్ టీల్, ప్రిస్టీన్ వైట్ అనే మూడు రంగులను కొనసాగించారు. ఇంటీరియర్ ఇప్పుడు డ్యూయల్-టోన్ కలర్ థీమ్ లో పూర్తయింది. సెంటర్ కన్సోల్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ (android) ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కొత్త ఫ్రీస్టాండింగ్ 10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో రీడిజైన్ చేయబడింది. ప్రకాశవంతమైన టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉంది.
వేరియంట్స్, సెక్యూరిటీ ఫీచర్స్
ఇది కాకుండా, టియాగో ఈవీ లో టాటా మోటార్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, షార్క్-ఫిన్ యాంటెనా, అప్ డేటెడ్ డ్రైవర్ డిస్ ప్లే, హెచ్ డి రియర్ పార్కింగ్ కెమెరా వంటి సెక్యూరిటీ ఫీచర్లను జోడించింది. 2025 టియాగో ఈవీ ఎక్స్ఈ, ఎక్స్ టీ వేరియంట్ల ధరలు ఇప్పటికీ రూ.8 లక్షలు, రూ.9 లక్షలుగా ఉన్నాయి. ఎక్స్ టీ ఎల్ఆర్ ధర ఇప్పుడు రూ.14,000 పెరిగి రూ.10.14 లక్షలుగా ఉంది. ఎక్స్ జెడ్ ప్లస్ వేరియంట్ ను టాటా మోటార్స్ (tata motors) నిలిపివేసింది. ఎక్స్ జెడ్ ప్లస్ టెక్ లక్స్ ఎల్ఆర్ వేరియంట్ ధర కూడా రూ .14,000 పెరిగింది. దాంతో, ఇప్పుడు దీని ధర రూ .11.14 లక్షలకు చేరింది. ఇందులో రోటరీ డయల్, ఐటిపిఎంఎస్, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆటోమేటిక్ వైపర్లు మరియు హెడ్ ల్యాంప్స్, స్టార్ట్/స్టాప్ మరియు క్రూయిజ్ కంట్రోల్ కోసం పుష్ బటన్ వంటి ఇతర ఫీచర్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి.
టాటా టియాగో, టిగోర్ లాంచ్
టాటా మోటార్స్ టాటా టిగోర్, టాటా టియాగోలను కూడా అప్ డేట్ చేసింది. ఈ రెండు వాహనాలు ఇప్పుడు కొత్త రంగులతో అప్ డేటెడ్ ఇంటీరియర్స్ తో వస్తున్నాయి. హైట్ అడ్జస్టబుల్ సీటు, క్యాబిన్ లో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్, 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, టిపిఎంఎస్, కొత్త రియర్ కెమెరాను టాటా టిగోర్, టాటా టియాగో లకు జోడించింది.
టాపిక్