2025 Suzuki Hayabusa : యువతకు పిచ్చెక్కించే బైక్ ఇది- హయాబుసా ఇప్పుడు సరికొత్తగా..-2025 suzuki hayabusa unveiled check whats new and other details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2025 Suzuki Hayabusa : యువతకు పిచ్చెక్కించే బైక్ ఇది- హయాబుసా ఇప్పుడు సరికొత్తగా..

2025 Suzuki Hayabusa : యువతకు పిచ్చెక్కించే బైక్ ఇది- హయాబుసా ఇప్పుడు సరికొత్తగా..

Sharath Chitturi HT Telugu
Dec 28, 2024 03:30 PM IST

2025 Suzuki Hayabusa : 2025 సుజుకీ హయాబుసా వచ్చేసింది! ఈ మోడల్​ని అంతర్జాతీయ మార్కెట్​లో ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఈ బైక్​ పూర్తి విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 సుజుకీ హయాబుసా..
2025 సుజుకీ హయాబుసా..

2025 హయాబుసాని అంతర్జాతీయ మార్కెట్​లో ఆవిష్కరించింది సుజుకీ సంస్థ. వివిధ అప్డేట్స్​తో పాటు ఈ బైక్​ మూడు కొత్త కలర్​ ఆప్షన్స్​తో అందుబాటులోకి రానుంది. లాంచ్ కంట్రోల్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్​లో కూడా మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2025 సుజుకీ హయాబుసా విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

2025 సుజుకి హయాబుసా కొత్త కలర్ ఆప్షన్లు..

కొత్త హయాబుసా మూడు కొత్త రంగుల్లో లభిస్తుంది. అవి.. మెటాలిక్ మ్యాట్ గ్రీన్ / మెటాలిక్ మ్యాట్ టైటానియం సిల్వర్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ మిస్టిక్ సిల్వర్ / పర్ల్ విగోర్ బ్లూ.

2025 సుజుకీ హయాబుసాలో కీలక మార్పులు..

బైక్​ ఎఫెక్టివ్​నెస్​ని పెంచేందుకు లాంచ్​ కంట్రోల్​ మోడ్స్​లో స్పీడ్స్​ని రివైజ్​ చేయడం జరిగింది. అదే విధంగా.. రైడర్ బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్ ఉపయోగించి గేర్లను మార్చినట్లయితే హయాబుసా కొత్త స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ రద్దు అవ్వదు

2025 సుజుకీ హయాబుసా- స్పెసిఫికేషన్లు..

2025 సుజుకీ హయాబుసా బైక్​లో 1,340 సీసీ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ డీఓహెచ్​సీ ఇంజిన్ ఉంది. ఇది 9,700 ఆర్​పీఎమ్ వద్ద 190 బీహెచ్​పీ పవర్​ని- 7,000 ఆర్​పీఎమ్ వద్ద 142 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్​తో కనెక్ట్​ చేసి ఉంటుంది. హయాబుసాలో సుజుకీ ఇంటెలిజెంట్ రైడ్ సిస్టెమ్ (ఎస్.ఐ.ఆర్.ఎస్.) తో సహా అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

2025 సుజుకీ హయాబుసా- ఫీచర్స్​..

క్రూయిజ్ కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, మల్టిపుల్ పవర్ మోడ్స్, యాంటీ లిఫ్ట్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, హిల్ హోల్డ్ సిస్టమ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు 2025 సుజుకీ హయాబుసా బైక్​లో ఉన్నాయి. రైడర్​కు అన్ని కీలక సమాచారాన్ని చూపించే టీఎఫ్​టీ స్క్రీన్ కూడా ఉంది.

2025 సుజుకీ హయాబుసాలోని హార్డ్ వేర్ ఏంటి?

ఈ బైక్​లోని ముందు భాగంలో ఇన్వర్టెడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో సింగిల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. బ్రెంబో స్టైల్మా కాలిపర్లు ముందు భాగంలో 4-పిస్టన్లు, ట్విన్ డిస్క్​లతో బ్రేకింగ్ విధులను నిర్వహిస్తాయి. వెనుక భాగంలో సింగిల్ కాలిపర్​తో నిసిన్ కాలిపర్ ఉంది.

ఇండియాలో లాంచ్​ ఎప్పుడు?

భారత మార్కెట్లో ఈ సుజుకీ కొత్త హయాబుసా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియదు. దీనిపై సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ బైక్​కి ఇండియాలో క్రేజీ డిమాండ్​ ఉండటంతో త్వరలోనే లాంచ్​ అవ్వొచ్చని ఊహాగానాలు ఉన్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం