సరికొత్తగా ప్రీమియం 7 సీటర్​ ఎస్​యూవీ- 2025 స్కోడా కొడియాక్​ లాంచ్​..-2025 skoda kodiaq launched in india lakh check out what the premium suv packs ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  సరికొత్తగా ప్రీమియం 7 సీటర్​ ఎస్​యూవీ- 2025 స్కోడా కొడియాక్​ లాంచ్​..

సరికొత్తగా ప్రీమియం 7 సీటర్​ ఎస్​యూవీ- 2025 స్కోడా కొడియాక్​ లాంచ్​..

Sharath Chitturi HT Telugu

స్కోడా ఆటో ఇండియా తన ఫ్లాగ్​షిప్ ఆఫర్ కొడియాక్ ఎస్​యూవీకి చెందిన 2025 వర్షెన్​ని తాజాగా భారతదేశంలో రూ. 46.89 లక్షల (ఎక్స్-షోరూమ్)కు లాంచ్​ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

2025 స్కోడా కొడియాక్

సెకెండ్​ జనరేషన్​ స్కోడా కొడియాక్​ ఎస్​యూవీ ఇండియాలో తాజాగా లాంచ్​ అయ్యింది. ఈ ఫ్లాగ్​షిప్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 46.89 వద్ద ప్రారంభమవుతుంది. దిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్​పో 2025లో తొలిసారి ప్రదర్శించిన ఈ స్కోడా కొడియాక్​ని భారత్​లోనే అసెంబుల్ చేయనున్నారు. కొత్తగా లాంచ్ అయిన ఎస్​యూవీని స్పోర్ట్​లైన్, లారిన్ అండ్​ క్లెమెంట్ అనే రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. లారిన్ అండ్ క్లెమెంట్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.48.69 లక్షలు.

సరికొత్త డిజైన్, ప్రీమియం ఫీచర్లు, పనితీరుతో 2025 స్కోడా కొడియాక్ భారతదేశ ప్రీమియం ఎస్​యూవీ సెగ్మెంట్​లో ఉన్న పోటీని మరింత పెంచనుంది. టయోటా ఫార్చ్యూనర్, వోక్స్ వ్యాగన్ టిగువాన్ ఆర్-లైన్, జీప్ మెరిడియన్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 స్కోడా కొడియాక్: ఇంజిన్..

కొడియాక్ ఎస్​యూవీలో 2.0-లీటర్, 4 సిలిండర్​, టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్​ ఉంటుంది. ఇది 201 బీహెచ్​పీ పవర్​, 320 ఎన్ఎమ్ గరిష్ట టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ యూనిట్ ప్రస్తుత కొడియాక్ కంటే 14 బీహెచ్​పీ ఎక్కువ శక్తిని అందిస్తుంది. 7-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​ ఇందులో ఉంటుంది. అదనంగా, ఈ కొత్త తరం కొడియాక్ లీటరుకు 14.86 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది.

2025 స్కోడా కొడియాక్: ఎక్స్​టీరియర్

కొత్త కొడియాక్ స్కోడా ఎస్​యూవీ లేటెస్ట్, మోడర్న్ సాలిడ్ డిజైన్ లాంగ్వేజ్​ని కలిగి ఉంది, ఇది షార్ప్​ అండ్​ కమాండింగ్ రోడ్ ప్రెసన్స్​ని ఇస్తుంది. బోల్డ్ బటర్ ఫ్లై గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్​తో కూడిన యాంగ్యులర్​ హెడ్​ల్యాంప్స్, టెయిల్ గేట్ అంతటా అట్రాక్టివ్​ లైట్​స్ట్రిప్​ని కలిగి ఉన్న రీడిజైన్డ్​ రేర్​ లైట్లు వంటి అప్​గ్రేడ్స్​ ఈ ఎస్​యూవీకి లభించాయి.

ఈ సెకెండ్​ జనరేషన్​​ ఎస్​యూవీ పొడవు 4,758 ఎంఎం. ఇది మునుపటితో పోలిస్తే 61 ఎంఎం ఎక్కువ! దీని వెడల్పు కొద్దిగా తగ్గి 1,864 మిల్లీమీటర్లకు చేరింది. ఎత్తు 1,659 మిల్లీమీటర్లు కాగా, వీల్ బేస్ 2,971 ఎంఎంగా ఉంది. అదనంగా, కొడియాక్ కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ 17 నుంచి 20 ఇంచ్​ పరిమాణంలో లభిస్తాయి.

2025 స్కోడా కొడియాక్: ఇంటీరియర్..

ఇంటిరీయర్​ విషయానికొస్తే సరికొత్త కొడియాక్ సౌకర్యం, సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తుంది. దీని పొడిగించిన పొడవు ఎక్కువ క్యాబిన్ స్పేస్​, బూట్ సామర్థ్యాన్ని ఇస్తుంది. 7-సీటర్ కాన్ఫిగరేషన్​తో కొనసాగే అవకాశం ఉన్న ఈ ఎస్​యూవీలో ఇప్పుడు అనేక అధునాతన ఫీచర్లు కూడా చేరాయి. ఇందులో 13 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెట్ సిస్టెమ్, 10.25 ఇంచ్​ డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే, హెడ్స్-అప్ డిస్​ప్లే వంటివి ఉన్నాయి. న్యూ జనరేషన్​తో స్కోడా న్యూ స్మార్ట్​ డయల్​ సెటప్​ని సంస్థ పరిచయం చేసింది. ఇది ఇన్ఫోటైన్​మెంట్​ స్క్రీన్​ కింద ఉంటుంది. అనేక ఫంక్షన్స్​ని ఇది కంట్రోల్​ చేస్తుంది. వైర్​లెస్​ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 14-స్పీకర్ల కాంటోన్ సౌండ్ సిస్టెమ్, యాంబియంట్ లైటింగ్, హీటింగ్- కూలింగ్​తో కూడిన​ పవర్డ్ ఫ్రెంట్ సీట్స్​, పనోరమిక్ సన్​రూఫ్, వైర్​లెస్ ఛార్జింగ్, మల్టీ యూఎస్​బీ టైప్-సి పోర్ట్స్​ వంటివి ఇతర ప్రీమియం ఫీచర్లు.

2025 స్కోడా కొడియాక్: సేఫ్టీ..

ఈ ఎస్​యూవీ అడ్వాన్స్​డ్​ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టెమ్స్ (ఏడీఏఎస్) తో వస్తుంది. ఇది లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లను అందిస్తుంది. ఇందులో తొమ్మిది ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఇఎస్పి), హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ అసిస్ట్ వంటివి ఉన్నాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం