26.6 కి.మీ మైలేజ్​ని ఇచ్చే ఈ మారుతీ సుజుకీ సీఎన్జీ కారులో ఇప్పుడు 6 ఎయిర్​బ్యాగ్​లు, మరెన్నో కొత్త ఫీచర్స్​..-2025 maruti suzuki grand vitara s cng launched gets new features and 6 airbags ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  26.6 కి.మీ మైలేజ్​ని ఇచ్చే ఈ మారుతీ సుజుకీ సీఎన్జీ కారులో ఇప్పుడు 6 ఎయిర్​బ్యాగ్​లు, మరెన్నో కొత్త ఫీచర్స్​..

26.6 కి.మీ మైలేజ్​ని ఇచ్చే ఈ మారుతీ సుజుకీ సీఎన్జీ కారులో ఇప్పుడు 6 ఎయిర్​బ్యాగ్​లు, మరెన్నో కొత్త ఫీచర్స్​..

Sharath Chitturi HT Telugu

2025 మారుతీ సుజుకీ గ్రాండ్​ వీటారా ఎస్​ సీఎన్జీని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. కొత్త ఫీచర్లు, భద్రతాపరమైన ఎలిమెంట్స్​తో ఈ మోడల్​ని సంస్థ అప్డేట్​ చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

2025 మారుతీ సుజుకీ గ్రాండ్​ వీటారా ఎస్​ సీఎన్జీ

2025 గ్రాండ్ విటారా ఎస్​-సీఎన్జీ మోడల్‌ని భారత మార్కెట్​లో లాంచ్​ చేసింది మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్. ఇందులోని డెల్టా సీఎన్జీ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.48 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక జెటా సీఎన్జీ ట్రిమ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.62 లక్షలుగా ఉంది. ఈ కొత్త మోడల్ అప్‌డేట్ చేసిన ఫీచర్లు, భద్రతా పరికరాలతో వస్తుంది. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాము..

2025 మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​- సీఎన్జీ..

2025 మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​- సీఎన్జీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈపీఎస్​), ఈబీడీతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్​), ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటి భద్రతా ఫీచర్లు ఇప్పుడు స్టాండర్డ్‌గా అందుబాటులోకి వచ్చాయి.

ఇక ఫీచర్ల విషయానికి వస్తే, 2025 గ్రాండ్ విటారా సీఎన్జీలో పీఎం 2.5 డిస్‌ప్లేతో ఆటో ప్యూరిఫైర్, క్లారియన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక డోర్ సన్‌షేడ్‌లు, ఆర్​17 అల్లాయ్ వీల్స్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటివి ఉన్నాయి.

  • రూ. 10లక్షల బడ్జెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ కార్ల వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

2025 గ్రాండ్ విటారా ఎస్​-సీఎన్జీ నెక్ట్స్​ జెన్​ కే-సిరీస్ 1.5-లీటర్, డ్యుయెల్ జెట్, డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 102 బీహెచ్​పీ పీక్​ పవర్​ని, 136 ఎన్​ఎం పీక్ టార్క్ ఔట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. సీఎన్జీపై నడుస్తున్నప్పుడు, దీని పవర్​ 87 బీహెచ్​పీకి, టార్క్ 121.5 ఎన్​ఎంకి తగ్గుతుంది. ఇది కేవలం 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​- సీఎన్జీ 26.6 కి.మీ/కేజీ మైలేజీని అందిస్తుందని పేర్కొంది.

ఈ లాంచ్‌పై మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. “కొత్త 2025 గ్రాండ్ విటారా ఎస్ సీఎన్జీ స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అనేక కొత్త సౌలభ్యం, భద్రతా ఫీచర్లను అందిస్తుంది. మా నెక్ట్స్​ జెన్​ కే-సిరీస్ 1.5-లీటర్ డ్యుయెల్ జెట్ డ్యుయల్ వీవీటీ ఇంజిన్‌తో పనిచేస్తూ, ఇది అద్భుతమైన ఎస్​యూవీ డ్రైవ్ అనుభవాన్ని రాజీ పడకుండా, గుర్తించదగిన ఇంధన-సామర్థ్యాన్ని అందిస్తుంది. కొత్త గ్రాండ్ విటారా ఎస్​- సీఎన్జీ దాని పటిష్టమైన భద్రత, ప్రశంసనీయమైన సామర్థ్యంతో కస్టమర్ల మనసులను గెలుచుకోవడం కొనసాగిస్తుందని మేము నమ్ముతున్నాము,” అని అన్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం