2025 మహీంద్రా బోలెరో నియో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ అప్డేట్‌లో భాగంగా, కొత్త బోలెరో నియో ఎస్యూవీ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ భాగాల్లో, ఫీచర్ల పరంగా అనేక కొత్త విశేషాలను సంస్థ జోడించింది. అయితే, ఇంజిన్, మెకానికల్ అంశాలు మాత్రం పాత మోడల్‌లో ఉన్నట్టే కొనసాగాయి. ఈ నేపథ్యంలో కొత్త మహీంద్రా బోలెరో నియోకు సంబంధించిన వేరియంట్ల వారీ వివరాలు, ధరల జాబితాను ఇక్కడ తెలుసుకోండి..
2025 మహీంద్రా బోలెరో నియో ఎస్యూవీ ఇంజిన్ సామర్థ్యం పాత మోడల్ నుంచే తీసుకున్నారు. ఇందులో 1.5 లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది సుమారు 100 బీహెచ్‌పీ పవర్‌ని, 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (రూ.)
N4- 8.49 లక్షలు
N8- 9.29 లక్షలు
N10- 9.79 లక్షలు
N10 (O)- 10.49 లక్షలు
N11- 9.99 లక్షలు
రూ. 8.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలైన 2025 మహీంద్రా బోలెరో నియో N4 వేరియంట్‌లో ఉన్న ఫీచర్లు ఇవి:
మహీంద్రా బోలెరో నియో N8 వేరియంట్ రూ. 9.29 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తుంది. N4 వేరియంట్ కంటే అదనంగా ఇందులో ఈ ఫీచర్లు ఉన్నాయి:
మహీంద్రా బోలెరో నియో N10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.79 లక్షలుగా నిర్ణయించారు. బోలెరో నియో N8 కంటే అదనంగా ఇందులో ఉన్న ఫీచర్లు:
మహీంద్రా బోలెరో నియో N10 (O) వేరియంట్‌ను రూ. 10.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేశారు. ఇది N10 వేరియంట్ కంటే అదనంగా మల్టీ టెర్రైన్ టెక్నాలజీ, లెదరెట్ అప్‌హోలిస్ట్రీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
మహీంద్రా బోలెరో N11 వేరియంట్ N10 (O) కంటే అదనపు ఫీచర్లను కలిగి ఉంది మరియు దీని ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).
సంబంధిత కథనం