డియో స్కూటర్ అప్డేటెడ్ వర్షెన్‌ని తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ 2025 డియో కాస్మెటిక్ మార్పులు, ఓబీడీ 2 కంప్లైంట్ ఇంజిన్, కొత్త ఫీచర్లతో వస్తోంది. 2025 హోండా డియో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ఎక్స్‌షోరూం ధరలు రూ.96,749, రూ.1,02,144గా ఉన్నాయి.
2025 హోండా డియో ఇప్పుడు కొత్త 4.2 ఇంచ్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు మైలేజ్ ఇండికేటర్లు, ట్రిప్ మీటర్, ఎకో ఇండికేటర్, రేంజ్ (ఎంప్టీ డిస్టెన్స్)ని చూపిస్తుంది. నేవిగేషన్- కాల్ / మెసేజ్ అలర్ట్స్ కోసం హోండా రోడ్ సింక్ యాప్ సపోర్ట్ కూడా ఉంది. దీనితో డ్రైవింగ్‌లో ఉన్నా డ్రైవర్లు కనెక్టెడ్‌గా ఉండొచ్చు. వీటితో పాటు స్మార్ట్ కీ, మొబైల్ డివైజ్‌లను ఛార్జ్ చేయడానికి యూఎస్బీ టైప్ సీ పోర్టు కూడా ఉన్నాయి.
2025 హోండా డియో స్కూటర్ ఐదు రంగుల్లో లభిస్తుంది. అవి మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ స్పోర్ట్స్ యెల్లో, పెరల్ ఇగ్నియస్ బ్లాక్, ఇంపీరియల్ రెడ్.
2025 హోండా డియోలో 123.92 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్. ఇది 8.19బీహెచ్పీ పవర్, 10.5ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంధన వినియోగం, ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే ఐడ్లింగ్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్ కూడా ఇందులో ఉంది.
తాజా లాంచ్‌పై హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా సేల్స్- మార్కెటింగ్ డైరెక్టర్ యోగేష్ మాథుర్ మాట్లాడుతూ.. “డియో 125 కొత్త ఓబీడీ 2 బీ వెర్షన్‌ను ప్రవేశపెట్టడం మాకు సంతోషంగా ఉంది. రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్, అధునాతన టీఎఫ్టీ డిస్ప్లే, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లతో, కొత్త డియో 125 నేటి వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా రెడీ అయ్యిది, 'డియో వాంట్ టు హవ్ ఫన్? (Dio Wanna Have Fun)' అనే ట్యాగ్‌లైన్‌కు అనుగుణంగా, ఈ స్కూటర్ ఎల్లప్పుడూ భారతదేశ యువ తరంలో ప్రజాదరణ పొందిన ఆప్షన్. లేటెస్ట్ అప్డేట్స్తో ఈ విభాగంలో దాని స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది,” అని అన్నారు.
ఓబీడీ 2 బీ డియో 125ను పరిచయం చేస్తూ, హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్- సీఈఓ సుత్సుము ఒటాని మాట్లాడుతూ.. “21 సంవత్సరాలకు పైగా, డియో భారత మార్కెట్లో ఐకానిక్ పేరుగా ఉంది, స్టైల్, పనితీరు, నమ్మకానికి చిహ్నంగా నిలుస్తోది. ట్రెండీ, నమ్మదగిన మోటో-స్కూటర్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది మొదటి ఛాయిస్! కొత్త ఓబీడీ 2 బీ డియో 125 విడుదలతో, మోటో-స్కూటర్ యొక్క కోర్ కాన్సెప్ట్ చెక్కుచెదరకుండా, మా వినియోగదారులకు అదనపు విలువ అందిస్తూ, ఉత్సాహంతో దాని ఐకానిక్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మేము సంతోషిస్తున్నాము,” అని అన్నారు.
సంబంధిత కథనం