హీరో మోటోకార్ప్ బెస్ట్ ఆటోమొబైల్ తయారీదారుగా గుర్తింపు పొందింది. దేశీయ మార్కెట్లో స్ప్లెండర్‌తో సహా వివిధ బైక్‌లు, స్కూటర్‌లను విక్రయిస్తుంది. హీరో ఇప్పుడు 2025 గ్లామర్ మోటార్‌సైకిల్‌ను కొన్ని అప్డేట్స్‌తో విడుదల చేసింది. ధరకు కూడా అందుబాటులోనే ఉంది. ఈ బైక్ ధర, స్పెసిఫికేషన్ల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
2025 హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ ధర రూ. 84,698 నుంచి రూ. 90,698 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఓబీడీ-2బీ, డిస్క్ బ్రేక్ ఓబీడీ-2బీ వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. కొత్త హీరో గ్లామర్ బైక్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, సింగిల్-పీస్ సీట్ ఆప్షన్ ఉన్నాయి. ఇది క్యాండీ బ్లేజింగ్ రెడ్, బ్లాక్ మెటాలిక్ సిల్వర్, టెక్నో బ్లూ మ్యాట్ బ్లాక్ రంగులలో కూడా లభిస్తుంది.
ఈ మోటార్ సైకిల్ ఓబీడీ-2బీ ప్రమాణాలకు అనుగుణంగా అప్డేట్ చేశారు. కార్బన్ ఉద్గారాలలో ఏదైనా సాంకేతిక లోపాలు గుర్తిస్తే.. రైడర్‌ను అప్రమత్తం చేస్తుంది. ఇది కాకుండా హీరో గ్లామర్ పనితీరులో కూడా ఎటువంటి మార్పులు లేవు. కొత్త 2025 హీరో గ్లామర్ బైక్ శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఆప్షన్ పొందుతుంది. ఇందులో 124.7 సిసి ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 10 బీహెచ్‌పీ పవర్, 10.4ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇది 63 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
కొత్త హీరో గ్లామర్ మోటార్ సైకిల్ అనేక ఫీచర్లను కలిగి ఉంది. డిజిటల్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ బైక్ బరువు 121 కిలోలు, ఇంధన ట్యాంక్ సామర్థ్యం 13.6 లీటర్లు. ఈ బైక్ సేఫ్టీ కూడా బాగుంటుంది. ఇది రైడర్ రక్షణ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక 5-దశల ప్రీలోడ్ సర్దుబాటు చేయగల డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లతో సస్పెన్షన్ సెటప్‌ను కలిగి ఉంది. డ్రమ్/డిస్క్ బ్రేక్‌లు కూడా ఉన్నాయి. ఈ బైక్‌కు కస్టమర్ల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం