Electric Scooters : ఎవరినైనా ఈజీగా పడేసే లుక్స్.. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?-2025 ather 450x vs ola s1 pro vs tvs iqube st electric scooters which is best ev to purchase check comparison ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Electric Scooters : ఎవరినైనా ఈజీగా పడేసే లుక్స్.. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

Electric Scooters : ఎవరినైనా ఈజీగా పడేసే లుక్స్.. ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెస్ట్?

Anand Sai HT Telugu
Jan 05, 2025 05:59 PM IST

Electric Scooters : భారత ఆటోమెుబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు సందడి చేస్తున్నాయి. ఇదే అదునుగా చాలా కంపెనీలు కొత్త వాహనాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఏథర్ 450ఎక్స్ కూడా విడుదలైంది. అయితే ఏథర్ 450ఎక్స్, ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్‌లో ఏది బాగుంటుందో ఇక్కడ చూసి డిసైడ్ చేసుకోండి.

2025 ఏథర్ 450
2025 ఏథర్ 450

తాజాగా ఏథర్ ఎనర్జీ తన కొత్త 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. 450S, 450X, 450 అపెక్స్ మోడల్స్ తీసుకొచ్చింది. ఇందులో 450ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉన్న పాపులర్ ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ, ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది. ఈ 3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ల మధ్య తేడాలను చూద్దాం..

yearly horoscope entry point

ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు స్పందన ఎక్కువగా ఉంది. దీంతో కంపెనీలు సైతం.. వీటిపై ఫోకస్ చేస్తున్నాయి. మార్కెట్‌లోకి కొత్త కొత్త మోడళ్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఏతర్ కూడా 450ఎక్స్‌ను తెచ్చింది. ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్‌‌లో ఏది బెటర్ అని చూడండి.

బ్యాటరీ

కొత్త అప్‌గ్రేడ్ చేసిన ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఆప్షన్‌లో ప్రారంభించారు. 2.9kWh, 3.7kWh. ఇందులో 3.7kWh బ్యాటరీతో ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇతర రెండు ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోల్చవచ్చు. ఎందుకంటే వాటిలో అమర్చిన బ్యాటరీలు చాలా సామర్థ్యం కలిగి ఉంటాయి.

ధరలు చూసుకుంటే

3.7kWh బ్యాటరీ కలిగిన ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1 లక్షా 56 వేల 999. 4kWh కెపాసిటీ బ్యాటరీ కలిగిన ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.44 లక్షలు. 3.4kWh బ్యాటరీ కలిగిన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.66 లక్షలుగా ఉంది.

లుక్స్ పరంగా, కొత్త ఏథర్ 450ఎక్స్ మిగతా రెండింటికి భిన్నంగా ఉంటుంది. అయితే 2025 450X ఎలక్ట్రిక్ స్కూటర్ రూపురేఖలు పెద్దగా మారలేదు. కొత్త 450ఎక్స్ మంచి డిజైన్‌లో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లతో ఎల్ఈడీ హెడ్‌లైట్‌లను పొందుతుంది. ఓలా ఎస్1 ప్రో, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ వక్ర రూపాన్ని కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది.

రేంజ్ ఎంత ఇస్తుంది?

2025 ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ 3.7kWh కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌తో 156 కి.మీ వరకు ప్రయాణించగలదు. ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ ఒక్కసారి ఛార్జింగ్‌పై 195 కి.మీల రేంజ్ కలిగి ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ 3.4kWh బ్యాటరీ 145 కిలోమీటర్ల రేంజ్ అందించగలదు.

బ్యాటరీ ఛార్జింగ్

ఏథర్ 450ఎక్స్ స్కూటర్ బ్యాటరీని 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ చేయడానికి 3-3.5 గంటలు పడుతుంది. ఐక్యూబ్ ఎస్టీ స్కూటర్ బ్యాటరీని 80 శాతానికి ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటలు పడుతుంది. అయితే ఓలా ఎస్1 ప్రో 4kWh బ్యాటరీ 80 శాతానికి ఛార్జ్ చేయడానికి 4.5 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలను చూసి.. ఏది బాగుంటుందో డిసైడ్ చేసుకోండి.

Whats_app_banner