Triumph Tiger 850 Sport : 2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ లాంచ్- ధర ఎంతంటే..
2024 Triumph Tiger 850 Sport : ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ అప్డెటెడ్ వర్షెన్ లాంచ్ అయ్యింది. దీని ధరతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
2024 Triumph Tiger 850 Sport price : టైగర్ 850 స్పోర్ట్ బైక్‌కి ఎంవై2024 వర్షెన్‌ని లాంచ్ చేసింది ట్రయంఫ్ మోటర్‌సైకిల్స్. ఇండియాలో ఈ అడ్వెంచర్ టూరర్కి మంచి డిమాండ్ ఉంది. లేటెస్ట్ వర్షెన్‌లో రెండు కొత్త కలర్స్‌ని యాడ్ చేసింది ట్రయంఫ్ సంస్థ. అవి.. కొరోసి రెడ్, గ్రఫైట్- రౌలెట్ గ్రీన్ విత్ జెట్ బ్లాక్. ఈ నేపథ్యంలో ఈ కొత్త ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్..
ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ బైక్ అప్డేటెడ్ వర్షెన్‌లో స్టైలింగ్, ఇంజిన్ విషయంలో ఎలాంటి మార్పులు కనిపించవు. కొత్త రంగులతో పాటు జెట్ బ్లాక్, గ్రఫైట్, డియోబ్లో రెడ్ విత్ గ్రఫైట్ వంటి ఒరిజినల్ కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్‌లో 888 సీసీ, లిక్విడ్ కూల్డ్, ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది.. 8500 ఆర్‌పీఎ వద్ద్ 84 హెచ్‌పీ పీక్ పవర్‌ని, 6500 ఆర్పీఎం వద్ద పీక్ టార్క్‌ని జనరేట్ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉటుంది. స్లిప్ అండ్ క్లచ్ అసిస్ట్ లభిస్తుంది.
2024 Triumph Tiger 850 Sport launch : ప్రతి 10వేల కిలోమీటర్లు లేదా వార్షికంగా ఒకసారి ఈ బైక్‌ని సర్వీస్ చేయించాలని ట్రయంఫ్ చెబుతోంది.
ఇదీ చూడండి:- Range Rover: ఇక భారత్ లోనే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడల్స్ ఉత్పత్తి
2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్‌లో ట్యూబ్యులర్ స్టీల్ ఫ్రేమ్, బోల్ట్-ఆన్ సబ్‌ఫ్రేమ్, ట్విన్ సైడెడ్ అల్యూమినియం స్వింగ్ఆర్మ్ వంటివి ఉన్నాయి. ఫ్రెంట్లో 45ఎంఎం అప్‌సైడ్- డౌన్ ఫోర్క్, మేన్యువల్లీ అడ్జెస్టెబుల్ మోనోషాక్ యూనిట్ రేర్‌లో ఉండి, సస్పెషన్ సిస్టెమ్ని చూసుకుంటాయి.
బ్రెంబో స్టైలెమా 4 పిస్టన్ మోనోబ్లాక్ కాలిపర్స్‌తో ఆపరేట్ అయ్యే 320ఎంఎం డిస్క్ (ఫ్రెంట్), బ్రెంబో సింగిల్ పిస్ట్ స్లైడర్ కాలిపర్‌తో ఆపరేట్ అయ్యే సింగిల్ 255ఎంఎం డిస్క్ (రేర్)తో బ్రేకింగ్ సిస్టెమ్ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. డ్యూయెల్ ఛానెల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెమ్ కూడా ఇందులో ఉంది.
2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్- ధర ఎంతంటే..
2024 Triumph Tiger 850 Sport price in India : ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ అప్డేటెడ్ వర్షెన్.. దాని ఒరిజినల్ వర్షెన్‌తో సమానంగా ఉంది. ఇండియాలో ఈ 2024 ట్రయంఫ్ టైగర్ 850 స్పోర్ట్ బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 11.95 లక్షలుగా ఉంది.
ట్రయంఫ్ అంటేనే లగ్జరీ బైక్ అని తెలిసిన విషయమే. అందుకు తగ్గట్టుగానే ఈ బైక్ ధర కూడా ఉంది. కానీ.. అప్డేటెడ్ వర్షెన్ ధర పెంచకపోవడం విశేషం. ఇది బైక్ లవర్స్‌ని అట్రాక్ట్ చేస్తుందని సంస్థ భావిస్తోంది. మరి ఈ అప్డేటెడ్ వర్షెన్‌కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం