Maruti Suzuki Dzire : మధ్యతరగతి ప్రజలకు ప్రియమైన కారు.. ఇప్పుడు సరికొత్త అవతారంలో!
Maruti Suzuki Dzire 2024 : మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఈ మోడల్ లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇండియాలో మారుతీ సుజుకీ డిజైర్‌కి మంచి డిమాండ్ ఉంది. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఇదొక ప్రియమైన కారు! ఇక ఇప్పుడు ఈ డిజైర్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. లాంచ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు కానీ, ఈ మారుతీ సుజుకీ స్విఫ్ట్ డిజైర్ ఫేస్‌లిఫ్ట్, అక్టోబర్ 3వ వారంలో అరంగేట్రం చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ డిజైర్..
మారుతీ సుజుకీ డిజైర్ 2008లో లాంచ్ అయ్యి, ఆ తరువాత డిజైర్‌గా మారింది. కాంపాక్ట్ సెడాన్ మార్కెట్లో విజయవంతమైన పోటీదారుగా ఉంది. సెగ్మెంట్లో తన ఆకర్షణను కొనసాగించడానికి, తదుపరి తరం మారుతీ సుజుకీ డిజైర్ కొన్ని మెరుగైన స్టైలింగ్, ఫీచర్ అప్గ్రేడ్స్ని హామీ ఇస్తుంది.
2024 మారుతీ సుజుకీ డిజైర్: ఎక్స్టీరియర్..
ఇటీవల లీక్ అయిన స్పై షాట్స్ ప్రకారం.. రాబోయే మారుతీ సుజుకీ డిజైర్ బోల్డ్ డిజైన్ లాంగ్వేజ్‌ని కలిగి ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్‌తో వచ్చే మల్టిపుల్ హారిజాంటల్ స్లాట్స్‌తో కూడిన భారీ గ్రిల్, డీఆర్ఎల్లతో కూడిన కొత్త ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ లైట్లు ఇందులో ఉండనున్నాయి. కాంపాక్ట్ సెడాన్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్లతో రీడిజైన్ చేసిన వెనుక భాగం, షార్క్ ఫిన్ యాంటెనాతో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఉంటాయి.
2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంటీరియర్..
2024 మారుతీ సుజుకీ డిజైర్ క్యాబిన్ గణనీయమైన మార్పును పొందుతుందని భావిస్తున్నారు. 360-డిగ్రీల కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్లను పరిచయం చేసే అవకాశం ఉంది. యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేసే ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో పాటు స్పోర్టీ ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో ఉండనుంది. పుడిల్ ల్యాంప్స్, హెడ్-అప్ డిస్ప్లే, స్టైలిష్ డ్యూయెల్-టోన్ బీజ్, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ ఈ మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ అదనపు ప్రత్యేకతలు.
2024 మారుతీ సుజుకీ డిజైర్: ఇంజిన్..
నెక్ట్స్ జెనరేషన్ మారుతీ సుజుకీ డిజైర్.. లేటెస్ట్ స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్‌తో తన ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే అవకాశం ఉంది. అంటే సబ్ కాంపాక్ట్ సెడాన్ 1.2-లీటర్, 3 సిలిండర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉన్న రెండవ మోడల్ అవుతుంది. స్విఫ్ట్‌లో ఈ ఇంజిన్ 80బీహెచ్పీ పవర్, 112 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిజైర్‌కి కూడా ఇదే విధమైన పనితీరును అందిస్తుంది. 5-స్పీడ్ మేన్యువల్, ఏఎంటీ ఆప్షన్స్ ఉండొచ్చు.
స్విఫ్ట్‌లో ఇటీవల సీఎన్జీ వేరియంట్‌ను సంస్థ విడుదల చేసింది. ఇక ఇప్పుడు 2024 మారుతీ సుజుకీ డిజైర్‌లో కూడా ఈ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇది తక్కువ రన్నింగ్ ఖర్చులకు ఆకర్షితమయ్యే ప్రైవేట్ కొనుగోలుదారులలో పెరుగుతున్న ప్రజాదరణను తీర్చుతుంది. ఫ్లీట్ కొనుగోలుదారుల కోసం డిజైర్ టూర్ వెర్షన్ కూడా రావొచ్చు.
ఈ మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. లాంచ్ సమయానికి మరిన్ని వివరాలు స్పష్టమవుతాయి.
సంబంధిత కథనం