2024 KTM 250 Duke: కొత్త టీఎఫ్టీ స్క్రీన్ తో 2024 కేటీఎమ్ 250 డ్యూక్ లాంచ్-2024 ktm 250 duke launched at rs 2 41 lakh check whats new ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  2024 Ktm 250 Duke: కొత్త టీఎఫ్టీ స్క్రీన్ తో 2024 కేటీఎమ్ 250 డ్యూక్ లాంచ్

2024 KTM 250 Duke: కొత్త టీఎఫ్టీ స్క్రీన్ తో 2024 కేటీఎమ్ 250 డ్యూక్ లాంచ్

Sudarshan V HT Telugu

2024 KTM 250 Duke launch: పలు అప్ డేట్స్ తో 2024 మోడల్ కేటీఎమ్ 250 డ్యూక్ లాంచ్ అయింది. ఈ మోడల్ లో కొత్తగా టీఎఫ్టీ స్కీన్, ఎల్ ఈ డీ హెచ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే, దీని ధర కొంత ఎక్కువగా ఉంటుంది.

2024 కేటీఎమ్ 250 డ్యూక్

2024 కేటీఎమ్ 250 డ్యూక్ నిశ్శబ్దంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. 2024 కేటీఎమ్ 250 మోటార్ సైకిల్ ఇప్పుడు కొత్త టీఎఫ్టీ స్క్రీన్, బూమరాంగ్ ఆకారంలో ఎల్ ఇడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉన్న ఎల్ ఇడి హెడ్ ల్యాంప్ తో వస్తుంది. ఈ రెండు ఫీచర్లు పెద్ద 390 డ్యూక్ నుండి తీసుకున్నారు. 250 డ్యూక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.41 లక్షలు.

ఇతర అప్ డేట్స్

2024 కేటీఎమ్ 250 డ్యూక్ లో ఉన్న కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ రాత్రిపూట మంచి లైట్ త్రోను అందిస్తుంది. పగటిపూట రన్నింగ్ లైట్ కూడా దూకుడుగా కనిపిస్తుంది. కొత్తగా ఈ మోడల్ లో ఎల్సీడీ స్క్రీన్ స్థానంలో టీఎఫ్టీ స్క్రీన్ ను పొందుపర్చారు. ఇది అన్ని ఇతర ముఖ్యమైన సమాచారాలతో పాటు పెద్ద రెవ్ కౌంటర్ ను చూపిస్తుంది. దీనిలో హెడ్ సెట్, మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేయగల బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఎడమ హ్యాండిల్ బార్ లోని స్విచ్ క్యూబ్స్ ద్వారా దీన్ని నియంత్రించవచ్చు.

మెకానికల్ మార్పులేవీ లేవు..

కొత్తగా చేర్చిన ఈ రెండు ఫీచర్లు మినహా కొత్త కేటీఎం 250 డ్యూక్ లో ఎలాంటి ఇతర మార్పులు లేవు. ఇందులో కూడా లిక్విడ్ కూల్డ్ 249.07 సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. దీనిని కేటీఎం ఎల్సీ 4 సీ ఇంజన్ అని పిలుస్తారు. ఇది 9,250 ఆర్పీఎమ్ వద్ద 30.57 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 7,250 ఆర్పిఎమ్ వద్ద 25 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇందులో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంటుంది.

కెటిఎమ్ 250 డ్యూక్ హార్డ్ వేర్

కెటిఎమ్ (KTM) 250 డ్యూక్ లో స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది ముందు భాగంలో ఇన్వర్టెడ్ ఫోర్క్స్, వెనుక భాగంలో మోనోషాక్ తో సస్పెండ్ చేయబడి ఉంటుంది. రేడియల్ మౌంటెడ్ కాలిపర్ అయిన 320 ఎంఎం డిస్క్, ఫ్లోటింగ్ కాలిపర్ తో వెనుక భాగంలో 240 ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు సూపర్ మోటో మోడ్ వెనుక చక్రంలో ఏబీఎస్ ను డిసేబుల్ చేస్తుంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ లో ఎలాంటి మార్పులు లేవు.