Hyundai Creta : 6 నెలల్లో 1 లక్ష సేల్స్​- దుమ్మురేపుతున్న 2024 హ్యుందాయ్​ క్రేటా-2024 hyundai creta hits 1 lakh sales milestone 550 units sold each day ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Creta : 6 నెలల్లో 1 లక్ష సేల్స్​- దుమ్మురేపుతున్న 2024 హ్యుందాయ్​ క్రేటా

Hyundai Creta : 6 నెలల్లో 1 లక్ష సేల్స్​- దుమ్మురేపుతున్న 2024 హ్యుందాయ్​ క్రేటా

Sharath Chitturi HT Telugu

2024 హ్యుందాయ్ క్రెటా లాంచ్​ అయిన 6 నెలల్లోనే 1 లక్షల సైల్స్​ మైలురాయిని తాకింది. దీని బట్టి భారత మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్​యూవీల్లో హ్యుందాయ్​ క్రేటా ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు.

2024 హ్యుందాయ్​ క్రేటాకి అదిరిపోయే ఆదరణ!

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీకి సెగ్మెంట్​లో హ్యుందాయ్​ క్రేటాకు ఎప్పటి నుంచే మంచి ఆదరణ ఉంది. ఇక 2024 హ్యుందాయ్​ క్రేటా లాంచ్​తో డిమాండ్​ మరింత పెరిగింది. ఈ ఏడాది జనవరిలో లాంచ్​ అయిన 2024 హ్యుందాయ్​ క్రేటా, సేల్స్​ పరంగా దూసుకెళుతోంది! కేవలం 6 నెలల్లోనే 1 లక్ష సేల్స్​ మైలురాయిని టచ్​ చేసింది. అంటే రోజుకు 550 క్రేటా ఎస్​యూవీలు అమ్ముడుపోతున్నట్టు!ఈ లెక్కల బట్టి భారత మార్కెట్​లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్​యూవీల్లో హ్యుందాయ్​ క్రేటా ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు.

హ్యుందాయ్ క్రెటాని బ్రాండ్ కొత్త డిజైన్ లాంగ్వేజ్ 'సెన్సెస్ స్పోర్టినెస్' ఆధారంగా రూపొందించడం జరిగింది. మునుపటి తరం క్రెటా డిజైన్ కొంచెం పోలరైజ్డ్​గా ఉంది. అయితే ఫేస్ లిఫ్ట్​ క్రెటాకు మార్కెట్ నుంచి మంచి ఆదరణ లభించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సీఓఓ శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “కొత్త హ్యుందాయ్ క్రెటా 2024 అద్భుతమైన విజయంతో మేము థ్రిల్లింగ్​గా ఉన్నాము. మా ఎస్​యూవీ లక్ష అమ్మకాల మైలురాయిని సాధించింది. సెగ్మెంట్​లో దాని బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్​ను పునరుద్ఘాటించింది. హ్యుందాయ్ క్రెటా భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్​లను సెట్ చేస్తూ వినియోగదారులను అలరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము,” అని అన్నారు.

2024 హ్యుందాయ్ క్రెటా: ఇంజిన్​..

2024 హ్యుందాయ్ క్రెటా మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్స్​ని అందిస్తుంది. అన్నీ 1.5-లీటర్ సామర్థ్యంతో వస్తాయి. వీటిలో నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, డీజిల్ ఇంజిన్​లు ఉన్నాయి. ట్రాన్స్​మిషన్​ ఆప్షన్స్​ విషయానికొస్తే, 2024 క్రెటాలో 6 స్పీడ్ మాన్యువల్, ఐవీటీ (ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్​మిషన్), 7 స్పీడ్ డీసీటీ (డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్​మిషన్), 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్ ఉన్నాయి.

2024 హ్యుందాయ్ క్రెటా: సేఫ్టీ ఫీచర్స్​..

క్రెటాలో ఏడీఏఎస్, 6 ఎయిర్ బ్యాగ్స్​, బ్లైండ్ వ్యూ మానిటర్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్​తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటి అదనపు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

2024 హ్యుందాయ్ క్రెటా: ధర- వేరియంట్లు..

2024 క్రెటా ధర రూ .13.24 లక్షల నుంచి ప్రారంభమై రూ .24.37 లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు ధరలు ఎక్స్-షోరూమ్. ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్(ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్, ఎస్ఎక్స్(ఓ) అనే ఏడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

భారత ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎస్​యూవీ సెగ్మెంట్​లో విపరీతమైన పోటీ కనిపిస్తోంది. కియా సెల్టోస్​, టాటా పంచ్​, టాటా నెక్సాన్​, వోక్స్​వ్యాగన్​ టైగన్​, ఈకోస్పోర్ట్​ వంటి ప్రముఖ ఎస్​యూవీలకు 2024 హ్యుందాయ్​ క్రేటా గట్టి పోటీనిస్తోంది.

సంబంధిత కథనం